విటమిన్ ఎ లోపం ఎన్ని చర్మ సమస్యలను తెచ్చిపెడుతుందో తెలుసా?
TeluguStop.com
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కొన్ని పోషకాలు ఎంతో అవసరం.అటు వంటి పోషకాల్లో విటమిన్ ఎ ఒకటి.
చాలా మంది ఆరోగ్యానికి మాత్రమే విటమిన్ ఎ ఉపయోగపడుతుందని భావిస్తుంటారు.కానీ, చర్మ సంరక్షణలోనూ విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది.
పొరపాటున శరీరంలో విలమిన్ ఎ లోపం ఏర్పడిందా ఇక అనేక చర్మ సంబంధిత సమ్యలు చుట్టు ముట్టేస్తాయి.
మరి ఆ సమస్యలు ఏంటీ.వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మ కాంతిని పెంచడంలోనూ విటమిన్ ఎ ఎంతగానో సహాయపడుతుంది.కానీ, అదు విటమిన్ ఎ శరీరానికి సరిగ్గా అందకుంటే మాత్రం కొత్త చర్మ కణాల ఉత్పత్తి తగ్గి పోతుంది.
ఫలితంగా చర్మం కాంతి హీనంగా తయారు అవుతుంది. """/"/
అలాగే ముడతలు రాకుండా అడ్డు కట్ట వేసే సామర్థం విటమిన్ ఎ కి పుష్కలంగా ఉంది.
అయితే ఒక వేళ మీలో విటమిన్ ఎ లోపించిందీ అంటే చర్మంపై ముడతలు, సన్నని చారలు పడి.
పెద్ద వయసు వారిలా కనిపిస్తారు. """/"/
ఇక శరీరంలో విటమిన్ ఎ లోపిస్తే గనుక చర్మంపై మొటిమలు, వాటి మూలంగా నల్లటి మచ్చలు ఏర్పడతాయి.