వింట‌ర్ సీజ‌న్‌లో రోజూ నైట్ ఈ సీరమ్‌ రాసుకుంటే మ‌స్తు బెనిఫిట్స్‌!

వింట‌ర్ సీజ‌న్ అంటేనే ఎన్నెన్నో చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

చ‌ర్మం పొడి బారం, నిర్జీవంగా మార‌డం, మ‌చ్చ‌లు ఇలా అనేక స‌మ‌స్య‌లు వేధిస్తూ ఉంటాయి.

వీటిని నివారించుకునేందుకు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌య్యే ఖ‌రీదైన క్రీములు, లోషన్లు, టోనర్లు వంటివి ఏవేవో వాడ‌తారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ న్యాచుర‌ల్ సీర‌మ్‌ను యూజ్ చేస్తే.బోలెడ‌న్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

మ‌రి ఆ సీర‌మ్ ఏంటీ.? దాన్ని ఎలా తాయారు చేయాలి.

? ఎప్పుడు, ఎలా వాడాలి.? వంటి విష‌యాలను ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గుప్పెడు క‌మ‌లా పండు తొక్క‌లు మ‌రియు ఒక క‌ప్పు రోజ్ వాట‌ర్ వేసుకుని ఆరు లేదా ఏడు గంట‌ల పాటు నాన బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మెల్ల‌గా పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు మ‌రో బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ అలోవెర జెల్‌, ఒక విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్‌, అర స్పూన్ గ్లిజ‌రిన్ మ‌రియు ముందుగా త‌యారు చేసుకున్న క‌మ‌లా పండు తొక్క‌ల ర‌సం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఒక బాటిల్‌లో నింపు ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవాలి.ఇక ఇప్పుడు దీన్ని ఎలా వాడాలంటే.

ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు కూల్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

అనంత‌రం ముఖానికి త‌యారు చేసుకున్న సీర‌మ్‌ను అప్లై చేసి కాస్త డ్రై అయిన త‌ర్వాత నిద్రించాలి.

ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. """/"/ ఇలా ప్ర‌తి రోజూ చేస్తే ముఖ చ‌ర్మం పొడిబార‌కుండా ఉంటుంది.

స్కిన్ టోన్ పెరుగుతుంది.పిగ్మెంటేషన్ స‌మ‌స్య దూరం అవుతుంది.

న‌ల్ల‌టి మ‌చ్చ‌లు, ముడ‌త‌లు ఉండే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌రియు ముఖం గ్లోగా, అందంగా మెరిసిపోతుంది.

Healthy Salad : నిత్యం ఈ టేస్టీ సలాడ్ ను తిన్నారంటే వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్ తో స‌హా అదిరిపోయే బెనిఫిట్స్ మీసొంతం!