చింత‌గింజ‌లు ఉంటే చ‌ర్మానికి చింతే ఉండ‌దు..తెలుసా?

చింతగింజ‌లు.స‌రైన అవ‌గాహ‌న లేక పోవ‌డం వ‌ల్ల చాలా మంది వీటిని బ‌య‌ట‌ పారేస్తుంటారు.

కానీ, చింత గింజ‌ల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోష‌క విలువ‌లు ఎన్నో నిండి ఉంటాయి.

బ‌రువును త‌గ్గించ‌డంలోనూ, బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగు ప‌ర‌చ‌డంలోనూ, కంటి చూపును పెంచ‌డంలోనూ, డైజెషన్‌ను త‌గ్గించ‌డంలోనూ, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలోనూ.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా చింత‌గింజ‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.అలాగే చ‌ర్మానికి సైతం ఇది ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అవును, చింత గింజ‌లు ఇంట్లో ఉండే చ‌ర్మానికి చింతే ఉండ‌దు.మ‌రి ఎందుకు ఆల‌స్యం చ‌ర్మానికి చింత గింజ‌లు ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయో చూసేయండి.

చ‌ర్మంపై న‌ల్ల మ‌చ్చ‌లు, ముడ‌త‌లు ఉన్న వారు చింత గింజ‌ల‌ను ఎండ‌లో ఎండ బెట్టుకుని మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో స్పూన్ చింత గింజ‌ల పొడి, రెండు స్పూన్ల బొప్పాయి పేస్ట్ వేసి బాగా క‌లుపుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల అనంత‌రం చ‌ల్ల‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే కొద్ది రోజుల్లోనే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు త‌గ్గిపోతాయి.అలాగే పొడి చ‌ర్మంతో ఇబ్బంది ప‌డే వారు ఒక బౌల్‌లో రెండు స్పూన్ల చింత గింజ‌ల పొడి, నాలుగు స్పూన్ల పాలు వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి ప‌ది లేదా ప‌దిహేను నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం కూల్ వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.త‌ద్వారా డ్రై స్కిన్ తేమ‌గా, మృదువుగా మ‌రియు నిగారింపుగా మారుతుంది.

"""/"/ ఇక మొటిమ‌ల బాధితుల‌కు కూడా చింత గింజ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ చింత గింజ‌ల పొడి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌ల‌పై పూసి.ఆరిన త‌ర్వాత శుభ్రప‌రుచుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మొటిమ‌లు త‌గ్గిపోతాయి.

ఖైరతాబాద్ లో ప్రభుత్వ భూమిపై కబ్జా రాయుళ్ల కన్ను..!