తాటి ముంజలు ఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచుతాయి..తెలుసా?

తాటి ముంజలు.స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ఫుడ్స్‌లో ఇవి ఒక‌టి.

వీటిని ఇంగ్లీష్‌లో ఐస్ ఆపిల్ అని పిలుస్తుంటారు.వేస‌వి కాలం వ‌చ్చిందంటే చాలు ఎక్క‌డ చూసినా తాటి ముంజ‌లు క‌నువిందు చేస్తుంటాయి.

తియ్యగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే తాటి ముంజ‌ల‌ను అంద‌రూ ఇష్టంగా తింటుంటారు.

అల‌స‌ట‌ను దూరం చేయ‌డంలోనూ, శ‌రీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచ‌డంలోనూ, శ‌రీరంలో విషాల‌ను తొల‌గించ‌డంలోనూ, అధిక వేడిని త‌గ్గించి బాడీని కూల్‌గా మార్చ‌డంలోనూ ఇవి అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అయితే ఆరోగ్యానికే కాదు.చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా తాటి ముంజ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మ‌రి ఇంత‌కీ వీటిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో తెలుసుకుందాం ప‌దండీ.సాధార‌ణంగా ప్ర‌స్తుత వేస‌వి కాలంలో ఎండ‌ల కార‌ణంగా చెమ‌ట కాయ‌లు తీవ్రంగా వేధిస్తుంటాయి వీటిని నివారించ‌డంలో తాటి ముంజ‌లు గ్రేట్‌గా హెల్ప్ చేస్తాయి.

తాటి ముంజ‌ల్లో ఉండే వాట‌ర్‌ను తీసుకుని చ‌ర్మంపై పూసి.అర గంట పాటు వ‌దిలేయాలి.

ఆపై నార్మ‌ల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చెమ‌ట కాయ‌లు మాయం అవుతాయి.

"""/" / అలాగే ట్యాన్ స‌మ‌స్య‌ను నివారించ‌డంలోనూ తాటి ముంజ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఒక‌టి లేదా రెండు తాటి ముంజ‌ల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల శ‌న‌గ‌పిండి వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి ప‌ట్టించి ఆరిన త‌ర్వాత వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.ఇక రెండు తాటి ముంజ‌ల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో రెండు టేబుల్ స్పూన్ల లెమ‌న్ జ్యూస్‌ను వేసి మిక్స్ చేసుకుని.

ముఖానికి, మెడకు ప‌ట్టించాలి.ఇర‌వై నిమిషాల అనంత‌రం వాట‌ర్‌తో చ‌ర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేస్తే స్కిన్ గ్లోయింగ్ మారుతుంది.మ‌రియు చ‌ర్మంపై ఏమైనా మ‌చ్చ‌లు ఉంటే అవి క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

ట్రైకోడెర్మా విరిడి తో పంటలకు ఆశించే తెగుళ్ళకు చెక్..!