చర్మానికి చామంతి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?
TeluguStop.com
సాధారణంగా చాలా మంది చామంతి పూలు అలకరణకు మాత్రమే ఉపయోగపడతాయని భావిస్తుంటారు.కానీ, ఆరోగ్య పరంగానూ మరియు సౌందర్య పరంగానూ చామంతి పూలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
ముఖ్యంగా సౌందర్యానికి చామంతి పూలను ఇప్పుడు చెప్పే విధంగా యూజ్ చేస్తే గనుక.
మాస్తు స్క్రీన్ కేర్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.మరి లేటెందుకు చర్మానికి చామంతి పూలను ఎలా ఉపయోగించాలో ఓ లుక్కేసేయండి.
"""/"/
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్లు ఎండిన చామంతి పువ్వుల పొడి, ఒక స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి, మూడు లేదా నాలుగు స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్‌లా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి ముఖానికి అప్లై చేసి.పది నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో ఒకటి, రెండు సార్లు చేస్తే స్కిన్ టోన్ పెరుగుతుంది.
నల్ల మచ్చలు, మొటిమలు తగ్గు ముఖం పడతాయి.అలాగే ఒక కప్పు నీళ్లు తీసుకుని అందులో రెండు స్పూన్లు ఎండిన చామంతి పూల పొడి వేసుకుని బాగా మరిగించాలి.
ఇప్పుడు ఈ వాటర్‌తో ఐదు నిమిషాల పాటు ముఖానికి ఆవిరి పట్టాలి.ఇలా తరచూ చేస్తుండటం వల్ల ముఖం కాంతి వంతంగా మరియు తాజాగా మారుతుంది.
ఓపెన్ పోర్స్ తొలగిపోతాయి. """/"/
ఇక ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్లు ఎండిన చామంతి పువ్వుల పొడి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె వేసుకుని కలుపుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసి.డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముడతలు తగ్గి.
ముఖం మృదువుగా, యవ్వనంగా తయారవుతుంది.
ఈ ఎగ్ మాస్క్ తో స్పాట్ లెస్ అండ్ వైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?