బ్లాక్ టీలో ఇవి క‌లిపి రాస్తే..క్ష‌ణాల్లోనే గ్లోయింగ్ స్కిన్ పొందొచ్చ‌ట‌!?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యధికంగా తాగే పానియాల్లో బ్లాక్ టీ ఒక‌టి.శ‌రీరాన్ని హెల్తీగా, ఫిట్‌గా మ‌రియు ఎన‌ర్జిటిక్‌గా ఉంచ‌డంలో బ్లాక్ టీ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఎన్నో జ‌బ్బుల‌కు అడ్డు కట్ట వేయ‌డంలోనూ బ్లాక్ టీ ముందుంటుంది.అందుకే చాలా మంది త‌మ రెగ్యుల‌ర్ డైట్‌లో ఒక క‌ప్పు బ్లాక్ టీ ఉండేలా చూసుకుంటారు.

అయితే ఆరోగ్యానికే కాదు.చ‌ర్మానికి కూడా బ్లాక్ టీ బోలెడ‌న్ని బెనిఫిట్స్‌ను అందించ‌గ‌ల‌దు.

ముఖ్యంగా క్ష‌ణాల్లో గ్లోయింగ్ స్కిన్ కావాల‌ని కోరుకునే వారికి బ్లాక్ టీ బెస్ట్ ఆప్ష‌న్.

మ‌రి ఆల‌స్య‌మెందుకు బ్లాక్ టీని స్కిన్‌కి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బ్లాక్ టీ, ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ ఫైడ‌ర్‌, ఒక స్పూన్ లెమెన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముకానికి, మెడ‌కు అప్లై చేసి ప‌దిహేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకుంటూ కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే మృత‌క‌ణాల‌తో పాటు అధిక జిడ్డు కూడా పోయి చ‌ర్మం గ్లోగా మెరుస్తుంది.

"""/" / అలాగే ఒక గిన్నెలో మూడు స్పూన్ల బ్లాక్ టీ, ఒక స్పూన్ ముల్తాని మ‌ట్టి వేసుకుని క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఫేస్ కు పూసి ఇవ‌రై, ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే స్కిన్ టోన్ పెరుగుతుంది.

మ‌రియు ముఖం ఎల్ల‌ప్పుడూ కాంతివంతంగా క‌నిపిస్తుంది. """/" / ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బ్లాక్ టీ, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి కాసుపు ర‌బ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత క‌సేపు డ్రై అవ్వ‌నిచ్చి చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేస్తే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోయి.చర్మం స్మూత్‌గా, షైనీగా మారుతుంది.

ఖైదీ 2 సినిమాలో విక్రమ్ గా కమలహాసన్ పాత్ర ఎంటి అంటే..?