అరటి-పుదీనాలతో ఇలా చేస్తే ట్యాన్ సమస్యే ఉండదట?
TeluguStop.com
అరటి పండు, పుదీనా.ఈ రెండూ విడి విడిగా ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయి.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి.
అలాగే చర్మానికి సైతం ఈ రెండూ బోలెడన్ని ప్రయోజనాలను అందించగలవు.చర్మ సంరక్షణకు ఉపయోగపడే పోషక విలువలు అరటి పండు, పుదీనాలలో మెండుగా ఉన్నాయి.
అందు వల్లనే, ఈ రెండింటిని ఉపయోగించి రకరకాల చర్మ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.ట్యాన్.
స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే కామన్ సమస్య ఇది.
అర గంట ఎండలో ఉంటే చాలు చర్మం నల్లగా మారిపోతుంటుంది.అయితే అలాంటి సమయంలో ఒక మిక్సీ జార్‌లో బాగా పండిన ఒక అరటి పండు, గుప్పెడు పుదీనా ఆకులు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసి చర్మానికి అప్లై చేయాలి.
పావు గంట అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
ఇలా రోజూ చేస్తే ట్యాన్ సమస్యే ఉండదు. """/" /
అలాగే డార్క్ స్పాట్స్‌తో ఇబ్బంది పడే వారు.
ఒక అరటి పండు, గుప్పెడు పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పాలు మిక్స్ చేసి.
చర్మానికి పట్టించాలి.ఇరవై నిమిషాల పాటు డ్రై అయిన తర్వాత వాటర్‌తో శుభ్రపరుచుకోవాలి.
ఇలా రోజూ చేస్తే డార్క్ స్పాట్స్ క్రమంగా తగ్గిపోతాయి.ఇక డ్రై స్కిన్ ఉన్న వారు ఒక బౌల్ తీసుకుని అందులో స్పూన్ అరటి పండు గుజ్జు, స్పూన్ పుదీనా రసం, స్పూన్ పెరుగు మరియు కొద్దిగా బాదం ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని స్కిన్‌కు అప్లై చేసి.ఆరిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
ఇలా చేస్తే డ్రై స్కిన్ తేమగా మరియు మృదువుగా తయారు అవుతుంది.
గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?