గేమ్ ఛేంజర్ కియారా రెమ్యూనరేషన్ లీక్ చేసిన నటుడు ఎస్ జె సూర్య?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) నటించిన గేమ్ ఛేంజర్ ( Game Changer ) సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పెద్ద ఎత్తున చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ దర్శకుడు కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య ( SJ Suriya ) నటించిన విషయం తెలిసిందే.
"""/" /
ఇక ఈ సినిమా ద్వారా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో విలన్ పాత్రలలో సందడి చేస్తూ సూర్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సినిమాలో పాటల గురించి నటి కీయారా అద్వానీ ( Kiara Advani ) గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్న నేపథ్యంలో హీరోయిన్లుగా అంజలి ,కియారా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో కియారా గ్లామర్ డాల్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. """/" /
ఇక చరణ్ కియారా కాంబినేషన్లో ఇదివరకే వినయ విధేయ రామ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోయింది.ఇకపోతే ఈ సినిమా కోసం ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి తాజాగా నటుడు ఎస్ జె సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జరగండి అనే పాటలో కియారా చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు.దిల్ రాజు ఈ సినిమా కోసం కియారా అద్వానీకి ఇచ్చిన రెమ్యునరేషన్ ఆ ఒక్క సాంగ్ కే సరిపోతుందనీ తెలిపారు.
ఈ పాటలో ఆమె నటించిన తీరుకు తన రెమ్యూనరేషన్ మొత్తం సరిపోతుందని తెలిపారు.
అయితే ఈ సినిమాలోకి అర సుమారు 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుందని ఈయన చెప్పకనే చెప్పేశారు.
వైరల్ వీడియో: ఇలా కూడా కారు టైరును మార్చవచ్చా?