యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!

అమెరికా రాజకీయాల్లో వాస భారతీయుల ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మేయర్లుగా, సెనేటర్లు, ఎంపీలుగా, మంత్రులుగా మనోళ్లు అక్కడ కీలక స్థానాల్లో ఉన్నారు.

కాస్తలో మిస్ అయ్యింది కానీ లేదంటే అమెరికా అధ్యక్షురాలిగా భారత మూలాలున్న కమలా హారిస్ ( Kamala Harris )ఎన్నికయ్యేవారు.

అయినప్పటికీ భారతీయులకు అమెరికాలో ఎదురులేదన్న సంగతి తెలిసిందే.గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆరుగురు భారత సంతతి నేతలు యూఎస్ ప్రతినిధుల సభకు ఎన్నికవ్వగా.

వీరంతా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.అమెరికాలో భారతీయులు ( Indians In America )ఈ స్థాయిలో ఆ దేశ పార్లమెంట్‌కు ఎన్నికవ్వడం ఇదే తొలిసారి.

అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, శ్రీథానేదర్, సుహాస్ సుబ్రహ్మణ్యంలు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

వీరిలో సుహాస్ సుబ్రహ్మణ్యం తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టారు.వర్జీనియాలోని( Virginia ) 10వ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన విజయం సాధించారు.

అంతేకాదు.అమెరికా తూర్పు తీర ప్రాంతం నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా సుహాస్ చరిత్ర సృష్టించారు.

"""/" / ఆరుగురు భారత సంతతి ఎంపీలు ( MPs Of Indian Origin )విజయం సాధించడంతో యూఎస్ కాంగ్రెస్‌లో సమోసా కాకస్ సైజు పెరిగింది.

భారతీయ వంటకమైన సమోసాకు ప్రపంచవ్యాప్తంగా వున్న ఆదరణ కారణంగా.ఈ వర్గానికి అమెరికాలో విశేషమైన ఆదరణ లభిస్తోంది.

అమెరికా పార్లమెంట్‌కు ఎన్నికైన సమయంలో రాజా కృష్ణమూర్తి తన ప్రసంగంలో ఈ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు.

నాటి నుంచి యూఎస్ కాంగ్రెస్ లోపల భారత సంతతికి చెందిన ఎంపీల గ్రూప్‌ను సమోసా కాకస్‌గా వ్యహరిస్తున్నారు.

"""/" / తాను 12 ఏళ్ల క్రితం తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తాను మాత్రం ఏకైక భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడినని, యూఎస్ చరిత్రలో మూడవ వ్యక్తినని ప్రమాణ స్వీకారం అనంతరం డాక్టర్ అమీ బేరా ట్వీట్ చేశారు.

కానీ ఇప్పుడు యూఎస్ కాంగ్రెస్‌లో భారతీయ అమెరికన్ల బలం ఆరుకు చేరిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రాబోయే సంవత్సరాల్లో యూఎస్ కాంగ్రెస్‌లో భారతీయ అమెరికన్ల సంఖ్య పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.

యూఎస్ సెకండ్ లేడీ ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసల వర్షం