వీడియో: ముదిరిన భూ వివాదం.. పట్టపగలే ఆరుగురు కుటుంబ సభ్యుల కాల్చివేత!

వీడియో: ముదిరిన భూ వివాదం పట్టపగలే ఆరుగురు కుటుంబ సభ్యుల కాల్చివేత!

మధ్యప్రదేశ్‌( Madhya Pradesh )లోని మోరెనా జిల్లా లెపా గ్రామంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది.

వీడియో: ముదిరిన భూ వివాదం పట్టపగలే ఆరుగురు కుటుంబ సభ్యుల కాల్చివేత!

ఒక పాత భూ వివాదం( Land Dispute ) ఒకే కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలను బలి తీసుకుంది.

వీడియో: ముదిరిన భూ వివాదం పట్టపగలే ఆరుగురు కుటుంబ సభ్యుల కాల్చివేత!

వివరాల్లోకి వెళ్తే.2013లో గజేంద్ర సింగ్ తోమర్, ధీర్ సింగ్ తోమర్ మధ్య వివాదం తలెత్తింది.

ఆ వివాదం కాలక్రమేణా ముదురుతూ వచ్చింది.ఈ క్రమంలోనే ఈ గొడవ ధీర్ సింగ్ తోమర్ కుటుంబంలోని ఇద్దరు సభ్యుల మరణానికి దారితీసింది.

ఈ సంఘటన కొన్నేళ్ల క్రితం జరిగింది.ఈ దుర్ఘటన తరువాత, గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబం గ్రామాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి తరలిపోయింది.

దానికంటే ముందు కోర్టు వెలుపల ఇరుపక్షాల మధ్య సెటిల్మెంట్ జరిగింది. """/" / కాగా ఇటీవల గజేంద్ర సింగ్ తోమర్( Gajendra Singh Tomar ), అతని కుటుంబం గ్రామానికి తిరిగి వచ్చారు.

అయితే ధీర్ సింగ్ తోమర్ తమ కుటుంబ సభ్యులను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు.

గజేంద్ర సింగ్ తోమర్ కుటుంబంపై దాడికి ప్లాన్ చేశాడు """/" / ప్లాన్ ప్రకారం పెద్ద తుపాకీ పట్టుకొని వచ్చి ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు సహా ఆరుగురిని కాల్చి చంపాడు.

ఈ మొత్తం ఘటన కెమెరాలో రికార్డయింది.ఒక స్థానికుడు రికార్డ్ చేసిన ఈ వీడియోలో ఒక వ్యక్తి వారిపై కాల్పులు జరపడానికి ముందు కొంతమంది వ్యక్తులు పెద్ద చెక్క కర్రలను ఉపయోగించి ఇతరులను దారుణంగా కొట్టడం కనిపించింది.

"""/" / ఇక ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం గ్వాలియర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీస్ అధికారులు 6 మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు.కాగా ఈ మృతదేహాలకు ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు.

ఈ షాకింగ్ ఘటనతో గ్రామంలో అధిక సంఖ్యలో పోలీసు అధికారులు మోహరించారు.పట్టపగలే ఏకంగా ఆరుగురిని చంపేయడం ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

భారతీయుల అక్రమ రవాణా .. యూకేలో ఇద్దరు వ్యక్తులకు జైలు