విద్యుదాఘాతంతో ఆరు గేదెలు మృతి

విద్యుదాఘాతంతో ఆరు గేదెలు మృతి

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం కొత్తగూడెంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై ఆరు పాడి గేదెలు మృతి చెందిన విషాద సంఘటన పాడి రైతుల శోకానికి కారణమైంది.

విద్యుదాఘాతంతో ఆరు గేదెలు మృతి

స్థానికులు,యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.గ్రామ శివారులో గల వ్యవసాయ భూమిలోకి గేదెలు మేతకు వెళ్లగా గురువారం సాయంత్రం వచ్చిన తీవ్రమైన గాలిదుమారానికి విద్యుత్ తీగ తెగి పడటంతో ఆ తీగకు తగిలి ఆరు గేదలు మృత్యువాత పడ్డాయి.

విద్యుదాఘాతంతో ఆరు గేదెలు మృతి

వాటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందని గేదెల యజమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ప్రకృతి,విద్యుత్ అధికారుల అలసత్వంతో తాము తీవ్రంగా నష్టపోయామని,ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరారు.

వామ్మో, ఈ పెళ్లికూతురు వేషం చూస్తే నవ్వాగదు.. హల్దీలోకి డైనోసార్‌లా ఎంట్రీ.. వీడియో వైరల్..

వామ్మో, ఈ పెళ్లికూతురు వేషం చూస్తే నవ్వాగదు.. హల్దీలోకి డైనోసార్‌లా ఎంట్రీ.. వీడియో వైరల్..