Sivaji Ganesan :పేరుకే తమిళియన్..కానీ శివాజీ గణేశన్ ఎన్ని తెలుగు సినిమాల్లో నటించాడో తెలుసా ?

ఈ మధ్య కాలంలో భారత దేశంలోని వివిధ సినీ పరిశ్రమలకు చెందిన కథానాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, వేరే చిత్ర పరిశ్రమలలో సినిమాలో చేయడం ఎక్కువగా జరుగుతోంది.

దీనిని "క్రాస్ పోలినేషన్" అని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.ఈ పద్దతి బాహుబలి చిత్రంతో మొదలయిందని చాలామంది భావిస్తున్నారు.

కానీ ఈ పద్దతి అంతకు ముందే ప్రాచుర్యంలో ఉందని మనం గుర్తించాలి.ఈ క్రాస్ పోలినేషన్ పద్దతి బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఉందని చెప్పేందుకు "నడిగర్ తిలగం" శివాజీ గణేశన్ ఒక ముఖ్య ఉదాహరణ.

ఆయన తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడు ఐనప్పటికీ తెలుగులో అనేక చిత్రాలలో నటించారు.

ఈ చిత్రాలలో ఆయనవి కొన్ని ముఖ్య పాత్రలైతే మరికొన్ని అతిధి పాత్రలు.ఆయన నటించిన సినిమాలు ఏమిటి అంటే.

పరదేశి:( Pardesi ) ఇది ద్విభాషా చిత్రం.ఈ చిత్రం 1953 లో విడుదల అయ్యింది.

ఈ చిత్రం తెలుగు లో "పరదేశి" గాను తమిళంలో "పూంగుతై" గాను రూపుదిద్దుకుంది.

ఈ సినిమాలో శివాజీ గణేశన్ ఏఎన్ఆర్, ఎస్ వీ ఆర్, అంజలి దేవిలతో కలసి నటించారు.

"""/" / పెంపుడు కొడుకు:( Pempudu Koduku ) ఈ చిత్రం 1953 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రంలో ఆయన ఎస్ వీ ఆర్, మహానటి సావిత్రి గారితో కలసి నటించారు.

ఈ చిత్రానికి ఎల్ వీ ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. """/" / బొమ్మల పెళ్లి :( Bommala Pelli ) ఈ చిత్రంలో శివాజీ గణేశన్, జమున ముఖ్య పాత్రలు పోషించారు.

ఆర్ యుం కృష్ణస్వామి ఈ చిత్రానికి దర్శకుడు.ఈ చిత్రం 1958 జనవరిలో తెలుగులో విడుదల కాగా తమిళంలో "బొమ్మే కళ్యాణం" అనే పేరుతో అదే ఏడాది మేలో విడుదలయింది.

పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం : పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు అందరు పిల్లలు.

ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో 1960 లో విడుదలయింది.ఈ చిత్రంలో శివాజీ ఒక స్పెషల్ రోల్ లో కనిపించరు.

భక్త తుకారాం: ( Bhakta Tukaram )ఈ సినిమాలో ముఖ్య పాత్ర భక్త తుకారాం అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు.

శివాజీ పాత్రలో శివాజీ గణేశన్ స్పెషల్ రోల్ చేసారు.ఈ చిత్రం 1973 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

"""/" / చాణిక్య చంద్రగుప్త:( Chanikya Chandragupta ) ఈ సినిమాలో చాణిక్యునిగా నాగేశ్వరరావు గారు, చంద్రగుప్తునిగా రామారావు గారు నటించారు.

ఇందులో అలెగ్జాండర్ పాత్రలో శివాజీ గణేశన్ కాసేపు మెరిశారు.ఈ చిత్రం 1977 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇవి మాత్రమే కాదు ఇంకా మనోహర, నివురుగప్పిన నిప్పు, బెజవాడ బెబ్బులి, విశ్వనాథ నాయకుడు, అగ్ని పుత్రుడు, రామదాసు, బంగారు బాబు, జీవన రాగాలు వంటి సినిమాల్లో శివాజీ గారు నేరుగా నటించి మెప్పించారు.

పైసా ఖర్చు లేకుండా ఇలా చేస్తే వైట్ అండ్ బ్రైట్ స్కిన్ మీ సొంతం!