Suhasini Siva Balaji : అందరి ముందు నటి సుహాసిని బండారం బయటపెట్టిన శివబాలాజీ.. సిగ్గుతో తలదించుకున్న బ్యూటీ?

కొన్ని కొన్ని సార్లు కొంతమంది అమాయకులకు కొత్త ప్లేస్ వాతావరణం ఎలా ఉంటుందో తెలియక కాస్త అయోమయం పడుతూ ఉంటారు.

అక్కడికి అందరూ ఎలా వస్తారు.ఎలా ఉంటారు అనేది క్లారిటీ ఉండదు.

దీంతో కొన్ని కొన్ని సార్లు వాళ్ల పరువు కూడా పోతూ ఉంటుంది.అయితే నటి సుహాసినికి కూడా ఇటువంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది.

అయితే ఆ విషయాన్ని తాజాగా శివబాలాజీ ( Siva Balaji )చెబుతూ ఆమె బండారం బయటపెట్టేసాడు.

అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నటిగా ఓ వెలుగు వెలిగింది జూనియర్ నటి సుహాసిని( Suhasini )ఇక సుహాసిని చిన్న వయసులోనే కెరియర్ ను మొదలు పెట్టింది.

అలా 2003 లో చంటిగాడు సినిమా ద్వారా కీలకపాత్ర పోషిస్తూ వెండితెరకు పరిచయమైంది.

ఈ సినిమాలో తొలి నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.నటనపరంగా మంచి మార్కులు సంపాదించుకుంది.

అలా ఆ తర్వాత లక్ష్మీ కళ్యాణం, అడ్డా, పెదబాబు, దోస్త్, గుణ, సుందరానికి తొందరెక్కువ, పున్నమినాగు, భూ కైలాష్, హైవే ఇలా వరుసగా 30 సినిమాలలో నటించింది.

ఇందులో కొన్ని సక్సెస్ కాగా మరికొన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి.ఇక తెలుగులోనే కాకుండా తమిళ, భోజ్ పురి సినిమాలలో కూడా నటించింది.

అయితే నటిగా అంతగా గుర్తింపు రాకపోయేసరికి బుల్లితెరపై అడుగు పెట్టింది.అలా 2010లో అపరంజి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.

దీంతో ఇక్కడ కూడా ఆమెకు నటిగా బాగానే కలిసి వచ్చింది.అలా ఆ తర్వాత అష్టాచమ్మా, అనుబంధాలు, ఇద్దరమ్మాయిలు, నా కోడలు బంగారం, శివ శంకరి, గిరిజా కళ్యాణం వంటి సీరియల్స్‌ లలో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది.

"""/" / అంతేకాదు ఎన్నో తమిళ్ సీరియల్స్ లో కూడా నటించింది.ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటిస్తున్నప్పుడు తన కోస్టార్ ధర్మ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది.

ఇక ఆ మధ్యనే స్టార్ మా లో ప్రసారమైన దేవత సీరియల్ లో మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ సీరియల్ పూర్తవగా ఇప్పటికీ ప్రేక్షకులు ఆమెను గుర్తుకు చేసుకుంటూనే ఉన్నారు.

"""/" / అంతేకాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది సుహాసిని.అయితే ఇదంతా పక్కన పెడితే కెరీర్ మొదట్లో ఎంతో సైలెంట్ గా ఎంతో అమాయకంగా కనిపించిన సుహాసిని ఇప్పుడు చాలా మారిపోయింది.

అయితే అప్పట్లో అంత అమాయకంగా ఉన్న ఈమెకు ఏమి తెలియకపోవటంతో పబ్ కు చీర కట్టుకొని వెళ్లినట్లు తెలిసింది.

తాజాగా జీతెలుగుకు సంబంధించిన సూపర్ క్వీన్ సీజన్ 2 ప్రోమో విడుదలయ్యింది. """/" / ఇక అందులో శివ బాలాజీ సుహాసిని గురించి యాంకర్ ప్రదీప్( Pradeep Machiraju ) తో పాటు అక్కడున్న ఆర్టిస్టులందరికీ తెలిపాడు.

ఒకసారి తన పుట్టినరోజును పబ్ లో చేసుకున్నాను అంటూ.అక్కడికి సుహాసిని పిలిచాను అని.

ఇక సుహాసిని పట్టుచీర కట్టుకొని.పువ్వులు పెట్టుకొని పెళ్లికి రెడీ అయ్యి వచ్చినట్టు వచ్చిందని.

ఇక అక్కడ ఉన్నవాళ్లంతా చూసి షాక్ అయ్యారు అంటూ.దీంతో తను ఆమె దగ్గరికి వెళ్లి ఒకచోట కూర్చోబెట్టి ఇక్కడే తినేసి వెళ్లిపో అని అన్నానని తెలుపటంతో అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.

ఇక సుహాసిని మాత్రం తెగ సిగ్గుపడుతూ తలదించుకుంటూ కనిపించింది.ఇక వెంటనే ప్రదీప్ కౌంటర్ వెయ్యగా.

అప్పుడంటే ఏమీ తెలీదు అని.ఇప్పుడు మొత్తం తెలిసింది కదా ఇప్పుడు ఎలా రావాలో తెలుసు అంటూ సమాధానం ఇచ్చింది సుహాసిని.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.