మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ అన్ని సిద్దం చేసుకుంటుంది.పడ్నవీస్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తే ఆ తర్వాత బల నిరూపణ చేసుకోవచ్చులే అంటూ బీజేపీ భావిస్తుంది.
ఆ సమయం వరకు ఏదైనా జరగవచ్చు అంటూ బీజేపీ చాలా నమ్మకంగా ఉంది.
బీజేపీ నమ్మకం చూస్తే శివసేన పార్టీకి టెన్షన్‌గా ఉందట.ఇప్పటికే బీజేపీ నాయకులు ఒకరు శివసేన పార్టీకి చెందిన 40 మంది మా పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు అంటూ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో శివసేన పార్టీ క్యాంపు ఏర్పాటు చేసింది.క్యాంపులో ఉన్నా కూడా దాదాపుగా 24 మంది ఎమ్మెల్యేలు ఊగిసలాటలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
24 మందిలో కనీసం 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లినా కూడా ఆ పార్టీ బలం మరింతగా పెరుగుతుంది.
బీజేపీకి ఇంకా కూడా 40 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంటుంది.శివసేన పార్టీ నుండి 20 మంది వస్తే కాంగ్రెస్ మరియు ఎన్సీపీల నుండి కూడా బీజేపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేయవచ్చు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అదే కనుక జరిగితే ఈ నెలాకరు వరకు బీజేపీ సొంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.