మరో యంగ్ హీరో తో సినిమా చేస్తున్న శివ నిర్వాణ…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది డైరెక్టర్లలో శివ నిర్వాణ( Shiva Nirvana ) ఒకరు.
ఈయన వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు.అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ సమంత లను పెట్టీ తీసిన ఖుషి సినిమా( Kushi Movie ) యావరేజ్ గా ఆడడంతో ప్రస్తుతం ఆయన ఏ హీరో తో సినిమా చేస్తున్నారనే టాక్ అయితే ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చని రేపుతుంది.
ఎందుకంటే శివ నిర్వాణ చేసిన స్టోరీలు అన్ని కూడా లవ్ స్టోరీలు కావడంతో ఇప్పుడు ఆయనతో లవ్ స్టోరీ చేయడానికి ఏ హీరో ముందుకు వస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఆయన చేసిన మొదటి రెండు సినిమాలు అయిన నిన్ను కోరి, మజిలీ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.
"""/" /
ఇంకా ఆ తర్వాత ఆయన చేసిన టక్ జగదీష్, ఖుషి సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు ఆయనకి క్రేజ్ తగ్గి మార్కెట్ పరంగా కొంతవరకు డౌన్ అయినట్టు గా తెలుస్తుంది.
అయితే ఇలాంటి సమయంలో ఈయనతో సినిమా చేసే హీరో ఎవరు అనేది కూడా ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
ఇక ఇప్పుడు తను ఓ మంచి లవ్ స్టోరీని రాసుకొని సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ఒక యంగ్ హీరో ను పెట్టి సినిమా చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది.
ఇదే నిజమైతే సంతోష్ శోభన్ కి శివ నిర్వాణ మంచి హిట్ ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
"""/" /
ఇక ఇప్పటికే సంతోష్ శోభన్ ( Santosh Soban )ప్లాపు ల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇది మంచి హిట్ ఇస్తుందా లేదా అనేదే ఇక్కడ తెలియాల్సి ఉంది.
ఇక సంతోష్ రీసెంట్ గా నందినీ రెడ్డి డైరెక్షన్ లో చేసిన అన్ని మంచి శకునములే సినిమా కూడా ప్లాప్ అయింది.
కాబట్టి ఈయన కెరియర్ నిలబడాలంటే ఇప్పుడు ఆయనకి ఒక మంచి హిట్ కావాలి.