బిష్కెక్‌లో తిరిగి సాధారణ పరిస్ధితులు : భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

విదేశీ విద్యార్ధులే లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు తెగబడటంతో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో( Bishkek ) ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులు( Indian Students ) హాస్టల్స్‌లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.

గదుల్లో ఆహార పదార్ధాలు నిండుకోవడంతో ఆకలితో అల్లాడిపోయారు.తమను ఆదుకోవాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరారు.

తక్షణం స్పందించిన కేంద్రం ప్రత్యేక విమానాల ద్వారా వారిని స్వదేశానికి తీసుకొచ్చింది.అంతేకాదు విద్యార్ధుల భద్రత దృష్ట్యా కిర్గిస్థాన్‌లో( Kyrgyzstan ) సాధారణ పరిస్ధితులు నెలకొనే వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేలా అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించింది.

"""/" / ఇదిలావుండగా.బిష్కెక్‌లో ప్రస్తుతం పరిస్ధితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ( Ministry Of External Affairs ) తెలిపింది.

ప్రస్తుతం దాదాపు 17,000 మంది భారతీయ విద్యార్ధులు కిర్గిస్తాన్‌లో చదువుకుంటున్నారని.వీరిలో ఎక్కువమంది బిష్కెక్‌లోనే ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

భారతీయ విద్యార్ధుల క్షేమ సమాచారాన్ని నిర్ధారించడానికి అక్కడి ఇండియన్ ఎంబసీ( Indian Embassy ) నిరంతరం వారితో టచ్‌లో ఉందని ఆయన వెల్లడించారు.

విద్యార్ధుల సహాయార్ధం 24/7 హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని జైస్వాల్ పేర్కొన్నారు. """/" / వేసవి సెలవుల కోసం స్వదేశానికి రావాలనుకునే విద్యార్ధుల కోసం ఢిల్లీ , బిష్కెక్, అల్మటీలలో విమానాలు అందుబాటులో ఉన్నట్లు జైస్వాల్( Jaiswal ) చెప్పారు.

విద్యార్ధులకు అవసరమైన సాయం చేసేందుకు భారత రాయబార కార్యాలయం కట్టుబడి ఉందన్నారు.బిష్కెక్‌లోని 10 వైద్య కళశాలలు తొమ్మిదో సెమిస్టర్ వరకు ఆన్‌‌లైన్‌ క్లాసులను ప్రారంభించాయి.

భద్రతకు భరోసా ఇస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్ధులు కిర్గిస్థాన్ రాజధాని నుంచి స్వదేశానికి చేరుకుంటున్నారు.

ఓ జాతీయ వార్తాసంస్థతో విద్యార్ధులు మాట్లాడుతూ.గడిచిన కొద్దిరోజులుగా పరిస్ధితులు మెరుగుపడ్డాయని, కానీ సాధారణ పరిస్ధితి నెలకొనేవరకు తిరిగి కిర్గిస్థాన్ వెళ్లబోమని తెలిపారు.

తరగతులు ఆన్‌లైన్ మోడ్‌కు మారిన వెంటనే.మా కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల సంగతి తెలిసిందని విద్యార్ధులు చెప్పారు.

తాము చదువుకుంటున్న యూనివర్సిటీలు తక్కువ ఛార్జీతో ఎయిర్‌పోర్టు వరకు మాత్రమే రవాణా సదుపాయం ఏర్పాటు చేశాయని వారు పేర్కొన్నారు.

అమెరికాలో మొదలైన అధ్యక్ష ఎన్నికల ఓటింగ్.. భారతీయులు ఈసారి ఏవైపు?