మార్కెట్ యార్డ్ కోసం స్థల పరిశీలన జిల్లా కలెక్టర్, ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో మార్కెట్ యార్డ్ కోసం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్థల పరిశీలన చేశారు.

ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతు ఆమోదయోగ్యమైన అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.రైతులకు అనుగుణంగా ఉండేందుకు ప్రస్తుతం వేములవాడలో కొనసాగుతున్న మార్కెట్ యార్డ్ ను మర్రిపల్లిలో ప్రధాన రోడ్డుకు అనుకొని ఉన్న విశాలమైన స్థలంలోకి మార్చేందుకు రెవెన్యూ , ఇంజనీరింగ్, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగింది.

రైతులతో పాటు సామాన్య ప్రజలు, క్రీడాకారుల అవసరాల కోసం వ్యవసాయ మార్కెట్ కు అనుసంధానంగా వేములవాడలో ఉన్న మిని స్టేడియం వలే ఇక్కడ విశాల విస్తీర్ణంలో మినీ స్టేడియం, క్రికెట్ గ్రౌండ్ నిర్మాణానికి కృషి చేస్తాం.

ప్రజా అవసరాలు తీర్చేలా భూములు అభివృద్ధి చేసేందుకే మొదటి ప్రాధాన్యత.ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను అన్ని రకాలుగా అభివృద్ది చేసేలా చర్యలు చేపడతాం.

భూమిని ఎలా అభివృద్ది చేయాలనే దానిపై అధికారులతో చర్చించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు.

మహేష్ బాబు మా దేవుడంటూ వైరల్ అవుతున్న ఫ్లెక్సీ.. అసలేం జరిగిందంటే?