ఆ ఇద్దరు స్టార్ హీరోల కూతుర్ల మధ్య పెద్ద పోటీ.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే చావగొడుతున్నారుగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి మనందరికీ తెలిసిందే.

ఈ వయసుకే సితార ఘట్టమనేని ఇంస్టాగ్రామ్ లో లక్షల కొద్ది ఫాలోవర్లను సంపాదించుకుంది.

కాగా సితారకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక మరొకవైపు అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల కూతురు అర్హ కూడా చిన్న వయసుకే సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.

అంతేకాకుండా అల్లు అర్హ కు ఇంస్టాగ్రామ్ లో ఖాతా కూడా ఉన్న విషయం తెలిసిందే.

కాగా సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇకపోతే ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార సర్కారీ వారి పాట సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది.

అయితే మహేష్ బాబు గారాల పట్టి అయినా సితార డెబ్యూ చాలా పెద్దగా ఉంటుంది అని అభిమానులు ఆశించారు.

కానీ సితార మాత్రం జీ టీవీలోనే ఒక డాన్స్ షోలో అరంగ్రేటం చేయడం అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.

మహేష్ బాబు డాన్స్ జోకి రావడంతో పాటు తనతో పాటు కూతురు సితార ని కూడా పిలుచుకు వచ్చిన విషయం తెలిసింది.

"""/"/ అలాగే మరొకవైపు అల్లు అర్హ కూడా డాన్స్ నేర్పిస్తున్నారని ఆమె డాన్స్ వీడియోలు త్వరలోనే పోస్ట్ చేయనున్నట్లు స్నేహ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే అర్హ, సితార తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే.

కొందరైతే అలా చిన్న వయసులోనే వారిని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని, ఇలా వాళ్లని ఒక పబ్లిక్ ఫిగర్ చేయడం వల్ల ముందు ముందు వాళ్ళు ఈ ఒత్తిడిని తట్టుకోగలరా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

చదువుకోవాల్సిన సమయంలో ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ దృష్టి సెలబ్రిటీ స్టేటస్ అన్న దానిపై పడి ఒత్తిడికి గురై అవకాశం ఉంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనాప్పటికీ సోషల్ మీడియాలో అల్లు అర్హ వర్సెస్ సితార ఘట్టమనేని పోటీ బాగానే జరుగుతోంది.

వైరల్ ఫొటోస్: బెడ్ రెస్ట్‌లో ఉండి కూడా మొదటి కర్వా చౌత్ జరుపుకున్న స్టార్ హీరోయిన్..