Sitara : ఉగాది స్పెషల్.. బుట్టబొమ్మలా తయారైన సితార.. ఇంత అవసరమా అంటూ ట్రోల్స్?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
సితార( Sitara ) ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
ఈ చిట్టి పాపకే సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు.
తల్లిదండ్రులు సెలబ్రిటీలు కావడంతో సితారకీ చిన్న వయసులోనే ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాల్లో భారీగా అభిమానులు ఉన్నారు.
ఇకపోతే సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే.
"""/" /
తరచూసోషల్ మీడియాలో తనకు సంబందించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
కాగా సితార షేర్ చేసే ఫోటోలు వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి.
అంతేకాకుండా గట్టమనేని అభిమానులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు ఆ వీడియోలపై కామెంట్ ల వర్షం కూడా కురిపిస్తూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఉగాది పండుగ ( Ugadi Festival )సందర్భంగా మహేష్ బాబు ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేసింది.
కాగా సీతార ఆ ఫోటోలలో లంగావోణి ధరించి కుందనపు బొమ్మలా ఎంతో అందంగా కనిపిస్తోంది.
"""/" /
అందుకు సంబంధించిన ఫోటోలను సితార సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
ఎల్లో,గ్రీన్ కాంబినేషన్ లో సితార ధరించిన లంగావోణీ ప్రస్తుతం నెటిజన్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
కాగా సితార ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటోంది.
పైగా మోడలింగ్ వైపు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.సితార ఫోటోలు చూసిన మరి కొంతమంది నెటిజెన్స్ ఇంత అవసరమా అంటూ సితార పై ట్రోల్స్ చేస్తున్నారు.
నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
బాడీలో వ్యర్థాలను బీట్ రూట్ తో తొలగించండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!