కాంగ్రెస్‌లో అమాంతం పెరుగుతున్న సీత‌క్క గ్రాఫ్.. ఆ జిల్లాల‌పై ఆమెదే పెత్త‌నం

కాంగ్ర‌స్ పార్టీలో మొద‌టి నుంచి మంచి ఇమేజ్ ఉన్న మ‌హిళా నాయ‌కురాలిగా సీత‌క్క‌కు పేరుంది.

ఆమె చేసే ప్ర‌జా సేవ‌నే ఆమెకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది.ఇంకా చెప్పాలంటే ఆమెకు పార్టీల‌కు అతీతంగా అభిమానులు కూడా ఉన్నారు.

అయితే మొద‌టి నుంచి కూడా ఆమె రేవంత్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితంగా ఉంటూ వ‌స్తున్నారు.

త‌న స్వంత అన్న‌లాంటి వారంటూ నిత్యం రేవంత్‌రెడ్డిని అనుస‌రిస్తూ ఉన్నారు.రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ కాక ముందు కూడా ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఏ నిర‌స‌న తెలిపినా దాంట్లో సీత‌క్క పాత్ర‌నే ఎక్కువ‌గా ఉంటుంది.

అలాంటి సీత‌క్క ఇమేజ్ ఇప్పుడు రేవంత్ టీపీసీసీ చీఫ్ అయ్యాక అమాంతం పెరుగుతోంది.

సీత‌క్క‌కు మంచి గుర్తింపు ఇస్తున్నారు రేవంత్‌రెడ్డి.ఇప్పుడు పార్టీలో ఏ నిర్ణ‌యం తీసుకున్నా కూడా దాంట్లో సీత‌క్క స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా ఉంటాయ‌ని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్‌లో ఇప్పుడు నిర్వ‌హిస్తున్న ద‌ళిత‌, గిరిజ‌న దండోరా కార్య‌క్ర‌మాల‌ను మెయిన్‌గా సీత‌క్క‌నే లీడ్ తీసుకుంటోంద‌ని తెలుస్తోంది.

ఆ స‌భ‌ల‌ను ఆమె ఆధ్వ‌ర్యంలోనే నిర్వ‌హిస్తున్నారు.ఎవ‌రు మాట్లాడాలో, ఎంత సేపు మాట్లాడాలో ఇలా ప్ర‌తీదీ సీత‌క్క‌నే చూసుకుంటోంది.

"""/"/ ఇక వ‌రంగ‌ల్‌ జిల్లాల్లో అయితే ఇప్ప‌డు ప్ర‌ధానంగా సీత‌క్క నాయ‌క‌త్వ‌నే న‌డుస్తోంది.

ఆమె ఏది చెప్తే అదే అమ‌లు జ‌రుగుతోంది.పార్టీలోని నాయ‌కులు కూడా సీత‌క్క చెప్పిన‌ట్టే వింటున్నారు.

ఇప్ప‌టికే సీత‌క్క గ్రాఫ్ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న సంగ‌తి కూడా తెలిసిందే.అయితే పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్ల‌కు ఇది న‌చ్చ‌క‌పోయినా కూడా సీత‌క్క‌పై విమ‌ర్శ‌లు మాత్రం చేయ‌లేక‌పోతున్నారు.

అందుకు కార‌ణం ఆమెకు ప‌బ్లిక్‌లో ఉన్న ఇమేజ్‌.మొత్తానికి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప‌గ్గాలు తీసుకున్న త‌ర్వాత సీతక్క గ్రాఫ్ అమాంతం పెరిగిపోతోంది.

మ‌రి ముందు ముందు ఆమె ఏ స్థాయి వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా…అప్పుడు అలా… ఇప్పుడు ఇలా?