ఫామ్ హౌజ్ కేసులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫామ్ హౌజ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని, ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

అదేవిధంగా తమ దర్యాప్తునకు అంతరాయం కలిగించవద్దని, ఢిల్లీ సీపీని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.

ఈ క్రమంలో సిట్ పిటిషన్ తో పాటు బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ చేపట్టనుంది.

మోక్షజ్ఞ ప్రశాంత్ మూవీ రద్దు… సంచలనమైన లేఖ విడుదల చేసిన మేకర్స్!