టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అడిషనల్ ఛార్జ్‎షీట్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేసులో అడిషనల్ ఛార్జ్‎షీట్ దాఖలు చేయనుంది.

అడిషనల్ ఛార్జ్‎షీట్ లో సిట్ మొత్తం 37 మందిని చేర్చనున్నట్లు సమాచారం.ఈ మేరకు న్యాయసలహా తీసుకొని వచ్చే వారంలో అడిషనల్ ఛార్జ్‎షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఇప్పటివరకు 50 మందిని అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

వీరిలో 15 మంది నిందితులు బెయిల్ పై విడుదలవ్వగా ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ఇతరులు జైలులో ఉన్నారు.

ఈ నేపథ్యంలో అడిషనల్ ఛార్జ్‎షీట్ లో మిగతా పేర్లను చేర్చే యోచనలో సిట్ ఉందని తెలుస్తోంది.

కోట్లు ఇచ్చినా సరే ఈ నలుగురు హీరోలు చచ్చిన ఆ పని చేయలేదు !