బ్రేకింగ్ న్యూస్ : సిరివెన్నెల ఇకలేరు

ఆబాల గోపాలాన్ని తన సాహిత్యంతో అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) తుది శ్వాస విడిచారు.

న్యూమోనియాతో ఈ నెల 24న కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సరే కాపాడలేకపోయారు.

సిరివెన్నెల మృతితో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.1955 మే 20 న సివి యోగి, సుబ్బలక్ష్మి గార్లకు ఆయన జన్మించారు.

సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన తొలి పాట విధాత తలపున ప్రభవించినది అంటూ ఆయన రాసిన తొలి పాటే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాధించింది.

తెలుగు సినిమా సాహిత్యానికి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చిన వారిలో సీతారామశాస్త్రి ఒకరు.

సిరివెన్నెల సినిమాకు పాటలు రాసిన ఆయన అదే సినిమాను తన ఇంటిపేరుగా మార్చేసుకున్నారు.

కొన్ని వేల పాటలు రాసి కొన్ని పాటలు పాడి.కొన్ని పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానం పదిలం చేసుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగిపోయింది.

Baltimore Bridge Collapse : వంతెనను ఢీకొట్టిన కార్గో షిప్ : ఆగమేఘాలపై స్పందించిన భారతీయ సిబ్బంది .. బైడెన్ ప్రశంసలు