Sirivennela: సిరివెన్నెల జంట పదాల ప్రయోగం మళ్ళీ ఎవరైనా చేయగలరా ?

సిరివెన్నెల ( Sirivennela Seetharama Sastry ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి లభించిన ఒక ఆణిముత్యం.

తెలుగు సినిమాలకు రాస్తున్న పాటల రచయితగా ఆయన ఎన్నో చోట్ల అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ చివరి వరకు సినిమా కోసమే పని చేశాడు.

ఆయన మామూలు రచయితగా పని చేయడం కన్నా కూడా సినిమాలకు పాటలు( Songs ) రాయడంలోనే సంతోషం వెతుక్కున్నారు.

ఒకే రోజులో వింత వింత మూడ్స్ కలిగిన ఎన్నో విచిత్రమైన పాటలు రాసిన ఘనత కూడా సిరివెన్నెలకే దక్కుతుంది.

ఇక సినిమా ఇండస్ట్రీలో సిరివెన్నెల చేసిన నీ ప్రయోగాలు మరొక రచయిత చేయలేదు అంటే అది అతిశయోక్తి కాదు.

సిరివెన్నెల చేతుల మీదుగా జాలువారిన కొన్ని జంట పదాల ప్రయోగం గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / పాటల్లో చాలా క్లిష్టమైన పదాలను కూడా సరళమైన పద్ధతిలో చెబుతూ సిరివెన్నెల ఎన్నో కొత్త పదాలకు ప్రాణం పోశారు.

ఉదాహరణకు పట్టుదల సినిమాలో నిరంతరం ప్రయత్నం ఉండదా నిరాశకే నిరాశ పుట్టదా అంటూ నిరాశ అనే పదాన్ని రెండుసార్లు వాడి దాన్ని ఎంతో అర్థవంతంగా చెప్పారు సిరివెన్నెల గారు.

ఇక చిరంజీవి హిట్లర్ సినిమాలో( Hitler Movie ) కూడా ఇలాంటి ఒక ప్రయోగం చేశారు కన్నీళ్లకే కన్నీరు వచ్చే కష్టానికి కష్టం వేసే అంటూ గుండెలను ఎంతో తీవ్రమైన బాధతో వేధించే ఈ పదాలను ఎంతో అందంగా చెప్పారు సిరివెన్నెల గారు.

ఇక ఇటీవల వచ్చిన కంచ సినిమాలో సైతం ఇలాంటి ఒక ప్రయోగం చేశారు నిదర ఎప్పుడూ నిదరోతుందో మొదలు ఎప్పుడు మొదలవుతుందో అంటూ ఆయన ఇచ్చిన ఈ లైన్ ఎంతో మంది యువతకు బాగా నచ్చింది.

"""/" / ఇక నువ్వు వస్తావని( Nuvvu Vastavani ) అనే సినిమాలో సైతం ఇలాంటి ఒక పాటర్న్ ఉంటుంది.

నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే అని రాశారు.నీ కోసం అనే మరో సినిమాలో చినుకు తడికి చిగురు తొడుగు పుబ్బమ్మ అనే పాటలో కలలే కలగను రూపమా అంటూ కలలు కలలుగంటాయి అని చెప్పకనే చెప్పారు ఇలా శ్వాసకు శ్వాస ఆడటం, నిదురకు నిదురే రావడం వంటి భిన్నమైన ద్వంద పదాల కలయిక కేవలం సిరివెన్నెలకు మాత్రమే సొంతం ఇలా పద ప్రయోగం చేయగల మరొక పాటల రచయిత మళ్ళీ పుట్టడం అసాధ్యం.

సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు అయినా అసంతృప్తికి లోనైన దర్శకులు వీళ్లే!