సిరివెన్నెల ప్రతి పాట ఆణిముత్యమే.. ఆయనకు వచ్చిన అవార్డులు ఇవే!

టాలీవుడ్ లోని ప్రముఖ గేయ రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఒకరు.గత కొన్నిరోజులుగా న్యూమోనియా ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడంతో కన్నుమూశారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి.1955 సంవత్సరం మే నెల 20వ తేదీన సిరివెన్నెల సీతారామశాస్త్రి విశాఖపట్నంలోని అనకాపల్లిలో జన్మించారు.

ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో బీఏ చదివిన సీతారామశాస్త్రి కొంతకాలం టెలీఫోన్స్ శాఖలో పని చేశారు.

3000కు పైగా పాటలు రాసిన సీతారామశాస్త్రి 11 నంది అవార్డులను, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులను సాధించారు.

2019 సంవత్సరంలో కేంద్రం సీతారామశాస్త్రికి పద్మశ్రీ అవార్డును ఇచ్చి గౌరవించిన సంగతి తెలిసిందే.

ఉత్తమ రచయితగా 1986 సంవత్సరంలో విడుదలైన సిరివెన్నెల సినిమాలోని విధాత తలపున పాటకు, 1987 సంవత్సరంలో విడుదలైన శృతిలయలు సినిమాలోని తెలవారదేమో స్వామి పాటకు, 1988 సంవత్సరంలో విడుదలైన స్వర్ణకమలం సినిమాలోని అందెలరవమిది పదములదా పాటకు నంది అవార్డులు వచ్చాయి.

"""/" / 1993 సంవత్సరంలో రిలీజైన గాయం సినిమాలోని సురాజ్యమవలనీ స్వరాజ్యమెందుకని పాటకు, 1994 సంవత్సరంలో విడుదలైన శుభలగ్నం సినిమాలలోని చిలక ఏ తోడు లేక పాటకు, 1996 సంవత్సరంలో విడుదలైన శ్రీకారం సినిమాలోని మనసు కాస్త కలత పడితే పాటకు, 1997లో విడుదలైన సింధూరం మూవీలోని అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే పాటకు, 1999లో విడుదలైన ప్రేమకథ సినిమాలోని దేవుడు కరుణిస్తాడని పాటకు, 2005లో విడుదలైన చక్రంలోని జగమంత కుటుంబం నాది పాటకు, 2010లో రిలీజైన ఎంతవరకు ఎందుకొరకు పాటకు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని మరీ అంతలా పాటకు నంది అవార్డులు దక్కాయి.

"""/" / తన ప్రతిభతో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం, మహాత్మ, కంచె సినిమాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సిరివెన్నెల సీతారామశాస్త్రి సాధించారు.

కంచె సినిమాకు ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వచ్చాయి.

వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. గ్రేట్ అంటూ?