సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి హేమంత్ ప్రతిభకు గుర్తింపు

జిల్లాపరిషత్ స్కూల్ నుంచి జాతీయ స్థాయికి.ఇన్స్పైర్ మానాక్ పోటీలకు పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ ఎంపిక సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి హేమంత్ ప్రతిభకు గుర్తింపు అభినందించిన కలెక్టర్రాజన్న సిరిసిల్ల జిల్లా: తల్లిదండ్రులు, పవర్ లూమ్ కార్మికులు ఇబ్బందులు దూరం చేయాలనే ఆ విద్యార్థి ఆలోచనకు ఉపాధ్యాయుడి తోడ్పాటుతో రూపం వచ్చింది.

పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయింది.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి దేశ రాజధాని లో చేపట్టనున్న పోటీలకు ఎంపికవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు కష్టాలను ఎలాగైనా దూరం చేయాలని సిరిసిల్ల పట్టణం గణేష్ నగర్ కు చెందిన జక్కని జ్ఞానేశ్వర్, రూప కొడుకు హేమంత్ సిరిసిల్ల శివ నగర్ లోని కుసుమ రామయ్య బాలుర స్కూల్ పదో తరగతి చదువుతున్నాడు.

నిత్యం తన ఇంట్లో పవర్ లూమ్ లఫై ఉత్పత్తి అయిన బట్టలను మడత పెట్టేందుకు తన తల్లిదండ్రులు, సమీపంలోని కార్మికులు ఇబ్బంది పడుతున్నది చూసాడు.

గంటల తరబడి బట్టను మడత పెడుతూ కాళ్లు, నడుము నొప్పులతో బాధపడే వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.

వారి కష్టాలను ఎలాగైనా దూరం చేయాలని ఎన్నో రోజులు ఆలోచించాడు.దీనిఫై తన స్కూల్ లోని ఉపాధ్యాయులతో మాట్లాడాడు.

వారి సలహాలు, సూచనల మేరకు దాదాపు రెండు నెలల పాటు కష్టపడి రూ.

రెండు వేలతో పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్ ను చక్రాలు, చైన్స్, మోటార్, సెన్సార్ ను ఉపయోగించి తయారు చేశాడు.

బట్టలు మడత పెట్టేందుకు గంట సమయం పడుతుండగా, ఈ యంత్రం సాయంతో కేవలం 10 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయవచ్చని హేమంత్ చెప్పాడు.

కలెక్టరేట్ లో ప్రదర్శన హేమంత్ తయారు చేసిన పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ఫిబ్రవరిలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికకాగా, అప్పటి కలెక్టర్ అభినందించారు.

అలాగే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో హేమంత్ ఎగ్జిబిట్ ను ఏర్పాటు చేసి ప్రదర్శించారు.

ఈ ఎగ్జిబిట్ ని టీ వర్క్స్ హైదరాబాద్ కి పంపించారు. రాష్ట్ర స్థాయి నుంచి.

హేమంత్ తయారు చేసిన ఎగ్జిబిట్ ను ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జాతీయ స్థాయి ఇన్స్పైర్ మానాక్ కు ఎంపికైంది.

వచ్చే నెలలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.ప్రతిభ చూపిన విద్యార్థికి కలెక్టర్ అభినందన ప్రతిభ చూపిన విద్యార్థి జక్కని హేమంత్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం అభినందించారు.

సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన సిరిసిల్ల విద్యార్థి జక్కని హేమంత్, గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో తయారుచేసిన పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ఎగ్జిబిట్ ఇన్స్పైర్ మానాక్ జాతీయ స్థాయికి ఎంపికైంది.

నేతన్నల కష్టాలకు పరిష్కారం చూపేది గా  తయారుచేసిన ఈ ఎగ్జిబిట్ గతంలో పలువురి మన్ననలు పొందింది.

ఎగ్జిబిట్ జాతీయస్థాయికి  ఎంపికవడంతో జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ విద్యార్థి హేమంత్ తో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను కలువగా, వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ఆ విద్యార్థిని అభినందించారు.జాతీయస్థాయికి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు.

స్పేస్ నుంచి సన్‌సెట్‌ని ఎప్పుడైనా చూశారా.. వీడియో వైరల్..