సిరివెన్నెలకు పేరు తెచ్చిన అద్భుత సినిమాలేంటో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో రెండు రోజుల వ్యవధిలో రెండు విషాద ఘటనలు జరిగాయి.

మొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ చనిపోగా.తాజాగా ఇవాళ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అస్తమించాడు.

ఆయన కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు రాశాడు.సినీ గేయ రచయితగా సిరివెన్నెల సినిమాతో 1986లో సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు సీతారామ శాస్త్రి.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సిరివెన్నెల రాసిన కవితలను చూసి.సీతారామ శాస్త్రికి దర్శకుడు కె విశ్వనాథ్ సినిమాలో అవకాశం ఇచ్చాడు.

"""/" / సినీ గేయ ర‌చ‌యిత‌గా సిరివెన్నెల 1984 బాలకృష్ణ హీరోగా కే.

విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమా జననీ జన్మభూమి.ఈ సినిమాతో ఆయన గేయ రచయితా పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత సిరివెన్నెల సినిమాతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా పేరును తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు.

ఆది భిక్షువు వాడిని ఏది కోరేది అనే పాట గొప్ప పేరును తెచ్చి పెట్టింది.

ఈ సినిమాతో ఆయన తొలి నంది అవార్డును అందుకున్నాడు.ఆ తర్వాత స్వర్ణ కమలం అనే సినిమా కూడా ఆయనకు మంచి పేరు తెచ్చింది.

అటు శృతి లయలు సినిమాలో సిరివెన్నెల రాసిన తెలవారదేమో సామి అనే పాట అత్యద్భుతంగా రాశాడు.

ఈ సినిమాకు మరో నంది దక్కింది.అటు బాలచందర్ తెరకెక్కించిన  రుద్రవీణ సినిమాలో సిరివెన్నెల రాసిన నమ్మకు నమ్మకు ఈరేయిని అనే పాట ఎవర్ గ్రీన్ గా నిలిచింది.

ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన శుభ లగ్నం సినిమాలోని చిలుకా ఏ తోడు లేక పాట కూడా ఎంతో పేరు సంపాదించింది.

ఈ పాటకు మరో నంది వచ్చింది.గులాబి, నిన్నేపెళ్లాడతా, సింధూరం లాంటి సినిమాల్లో ఆయన రాసిన పాటలు అద్భతం అనిపించాయి.

చక్రం సినిమాలో ఆయన రాసిన జగమంత కుటుంబం నాది అనే పాట అప్పట్లో గొప్ప పేరు సంపాదించుకుంది.

"""/" / మహేష్ బాబు హీరో చేసిన మురారి సినిమా కూడా సిరివెన్నెలకు మంచి పేరు తెచ్చింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆయన సాహిత్యానికి మంచి గుర్తింపు దక్కింది.రాజమౌళి తెరకెక్కిస్తున్నఆర్ఆర్ఆర్ సినిమాలో దోస్తీ అనే పాటకు లిరిక్స్ అందించాడు.

చివరగా శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాకు రెండు పాటలు రాశాడు.ఆయన అద్భుత సాహిత్యానికి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి.

Hero Naveen Polishetty : రోడ్డుప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు..!