జబర్దస్త్ కార్యక్రమానికి సిరి హనుమంత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. వారిని మించి పోయిందిగా?
TeluguStop.com
బుల్లితెర కార్యక్రమాలలో నెంబర్ వన్ షోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ కార్యక్రమం గత దశాబ్దన్నర కాలంగా ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.
ఇక ఈ కార్యక్రమానికి తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు( Siri Hanumanth ) యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇదివరకు అనసూయ ( Anasuya ) యాంకర్ గా వ్యవహరించేది ఆమె సినిమా అవకాశాలు రావడంతో ఈ కార్యక్రమం నుంచి తప్పకుండా అనంతరం సౌమ్యరావు యాంకర్ గా వ్యవహరించారు.
ఇక సౌమ్య రావు కూడా కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.
"""/" /
ఇలా సౌమ్య రావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో కొత్త యాంకర్ గా సిరి హనుమంత ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఇక ఈమె కూడా మొదటి ఎపిసోడ్ ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.
తాజాగా సిరి రెమ్యునరేషన్ ( Remuneration ) గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించడం కోసం సిరి ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.
అయితే అనసూయ రష్మి వంటి వారు ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించిన ఎపిసోడ్ కు రెండు లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు.
"""/" /
ఇక కొత్తగా ఈ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చినటువంటి సిరి మాత్రం వీరిని మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మల్లెమాల వారి నుంచి ఈ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్ యాంకర్ గా వ్యవహరించినందుకు ఏకంగా 3.
5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారని తెలుస్తుంది.వారానికి ఈ స్థాయిలో రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఈమె అనసూయ రష్మిని మించి రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారు అంటూ ఈమె రెమ్యూనరేషన్ వార్తలపై నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ…. షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడేనా?