బిగ్ బాస్ హౌస్ లో డైరెక్ట్ నామినేషన్స్.. ముద్దుల మామయ్యగా శ్రీహాన్ రచ్చరచ్చ?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 తాజాగా 14 వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక 14వ వారంలో భాగంగా తాజాగా కంటెస్టెంట్ లకు ఒక టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్.

కాగా హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

హౌస్ లో రేవంత్, శ్రీహాన్, ఇనయ, సత్య,ఆదిరెడ్డి,కీర్తి, రోహిత్ లు ఉన్నారు.ఈ ఏడుగురిలో శ్రీహన్ ఆల్రెడీ ఫైనల్ కి చేరుకోగా మిగిలిన ఆరుగురిలో మరొక నలుగురు ఫైనల్ కి ఎవరు చేరుతారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలోనే ఒక టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్.ఏడు ర్యాంకులు పెట్టి అందులో ఎవరు ఏ స్థానానికి అర్హులో ర్యాంకింగ్ తో చెప్పాలి అని తెలిపాడు.

ఇందులో మొదటి స్థానం రేవంత్ రెండవ స్థానంలో ఇనయా, మూడో స్థానంలో కీర్తి, నాలుగో స్థానంలో శ్రీ సత్య, ఐదవ స్థానంలో శ్రీహాన్, ఆరవ స్థానంలో ఆది రెడ్డి, చివరిగా ఏడవ స్థానంలో రోహిత్ నిలిచారు.

ఇక అందరూ ఏకాభిప్రాయం ప్రకారం రేవంత్ ని మొదటి స్థానం,శ్రీహన్ రెండవ స్థానం,ఆదిరెడ్డి 3, ఇనయ 4, శ్రీ సత్య 5, రోహిత్ 6, కీర్తి ఏడు స్థానాలను ఇచ్చారు.

రేవంత్ మొదటి ప్లేస్ దక్కించుకోవడంతో ఈ షోకి అన్ డిజర్వ్ ఎవరు అనేది ఫైనల్ కి చేరిన శ్రీహాన్ చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించడంతో రోహిత్ కి ఆ ట్యాగ్ ఇచ్చాడు శ్రీహాన్.

ఆ తర్వాత కంటెస్టెంట్ల మధ్య గుసగుసలు మొదలయ్యాయి.అప్పుడు శ్రీహన్ బాత్రూమ్ విషయంలో వాదన తప్పు అంటున్నారు అంటూ బాధపడ్డాడు.

అలాగే కీర్తి విమర్శించడం పట్ల శ్రీహన్ అసహనం వ్యక్తం చేశాడు. """/"/ ఆ తర్వాత శ్రీహాన్ శ్రీ సత్యల మధ్య కూడా గొడవ బాగానే జరిగింది.

శ్రీ హాన్ మారిపోయాడు అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా ఉన్నాడు బిహేవ్ చేస్తున్నాడు అనడంతో వెంటనే శ్రీహాన్ ఎప్పుడు ఒకేలా ఉండరు అని తెలిపాడు.

అప్పుడు శ్రీహాన్ ఒక సీక్రెట్ విషయం బయటపెట్టాడు.ఇకపై తాను ముద్దుల మామయ్య గా మారిపోయానని, తాను వేసే ప్రతి షర్టుపై సిరి ముద్దు ఉంటుందని చెప్పడంతో అది విన్న రేవంత్ ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ని పెట్టాడు.

అనంతరం రోహిత్ తనని అన్ డిసర్వ్ అనే ట్యాగ్ ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేశాడు.

అందాన్నే కాదు శనగపిండి జుట్టును కూడా పెంచుతుంది.. ఎలా వాడాలంటే..?