మాస్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపుతున్న సిరి హనుమంత్.. వీడియో వైరల్!

యూట్యూబర్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని ఎన్నో వెబ్ సిరీస్లలో నటిస్తూ సందడి చేస్తున్న సిరి హనుమంత్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమము ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమె నెగిటివ్ షేడ్ లో పాపులర్ అయ్యారు.

మొత్తానికి బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి సిరీ అనంతరం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండటమే కాకుండా బుల్లితెరపై కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

సిరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే ఫోటోలు, డాన్స్ వీడియోలు,రీల్స్ కి విపరీతమైన అభిమానులు ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఈమె బుల్లితెర పై ప్రసారమవుతున్న స్టార్ మా పరివార్ కార్యక్రమంలో సందడి చేశారు.

షోలో సిరితో పాటు నోయెల్, ఆర్జే కాజల్, సన్నీ, మానస్, అరియానా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, ముక్కు అవినాష్ వంటి వారు పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఒక టాస్క్ లో సిరి పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో బాపుగారి బొమ్మ అనే పాటకు మొదట్లో క్యూట్ ఫర్ఫార్మెన్స్ చేసినప్పటికీ అనంతరం తన మాస్ స్టెప్పులతో దుమ్ము దులిపారు.

"""/"/ ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో భాగంగా సిరి డాన్స్ పెర్ఫార్మన్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.

ఇక ఈమె డాన్స్ చూసినటువంటి వారందరూ సిరి కిరాక్ పెర్ఫార్మెన్స్ అంటూ కొందరు కామెంట్లు చేయగా ఈమెలో ఇలాంటి మాస్ యాంగిల్ కూడా ఉందని గెస్ చేయలేదనీ, మైండ్ బ్లోయింగ్ ఫర్ఫార్మెన్స్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం సిరి చేసినటువంటి ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కాలు కడుక్కోవడానికి వెళ్తే.. మొసలి కడుపులోకి.. ఇండోనేషియాలో భయానక ఘటన!