శ్రీహన్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన సిరి.. అచ్చం సమంతలా అక్కడ టాటూ వేయించుకొని?

సిరి, శ్రీహన్ అనే ఈ పేర్లు సోషల్ మీడియా ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా సిరి మాత్రం బుల్లితెరపై బాగా పరిచయం పెంచుకుంది.ఎంతలా అంటే షణ్ముఖ్ అనగానే ఈమె చేసిన రచ్చ గుర్తుకు వచ్చే అంతలా.

యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సిరి.ఉయ్యాల జంపాల సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది.

ఆ తర్వాత మోహిని, అగ్నిసాక్షి సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక పలు వెబ్ సిరీస్ లలో కూడా గుర్తింపు తెచ్చుకుంది.సిరి శ్రీ హాన్ ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.

పైగా వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.అంతేకాకుండా వీరిద్దరు కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.

సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్ళు సిరీస్ లో నటించగా ఈ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నారు.

రామ్ లీలా అనే వెబ్ సిరీస్ కూడా వీరికి మంచి క్రేజ్ ను అందించింది.

అయితే గతంలో బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ 5 లో సిరి పాల్గొని ఎంత రచ్చ చేసిందో చూసాం.

ఏకంగా తన ఓవరాక్షన్ తో మరో ప్రేమ జంట మధ్య చిచ్చుపెట్టి పక్కకు తప్పుకుంది.

అందులో పాల్గొన్న కంటెస్టెంట్ షణ్ముఖ్ తో సిరి బాగా రెచ్చిపోయింది.ఫ్రెండ్షిప్ అనే ముసుగుతో హగ్స్, కిస్ లతో అందరిని షాక్ అయ్యేలా చేశారు.

"""/"/ గతంలో వీరిద్దరు కూడా పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కలిసి చేశారు.

తర్వాత ఇద్దరికీ బిగ్ బాస్ హౌస్ లో అవకాశం వచ్చింది.ఇక బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చకు బయట నెగెటివిటీని మోశారు.

ఇప్పుడు ఎవరి దారి వాళ్ళు అన్నట్లు ఉంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా ప్రస్తుతం బిగ్ బాస్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

తన ఆటపాటలతో అందర్నీ ఆకట్టుకున్నాడు శ్రీహాన్.ఇక సిరి కూడా శ్రీహాన్ ను గెలిపించడం కోసం సోషల్ మీడియా వేదికను బాగా వాడుకుంటుంది.

అయితే తాజాగా సిరి శ్రీహన్ ను సర్ప్రైజ్ చేసింది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.

తాజాగా బిగ్బాస్ ప్రోమో విడుదల కాగా.అందులో శ్రీహాన్ కోసం సిరి వచ్చింది.

ఇక సిరిని చూసి శ్రీహన్ చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాడు.ఇక సిరి గట్టిగా హాగ్ ఇచ్చింది.

"""/"/ ఆ తర్వాత సిరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో కాసేపు ముచ్చట్లు పెట్టింది.

ఇక సిరి శ్రీహాన్ దగ్గరికి వెళ్లి ఒక సర్ప్రైజ్ అంటూ సమంత లాగా తన వీపు పై భాగంలో మెడ దగ్గర శ్రీహాన్ అనే పేరు టాటూ గా కొట్టించుకుంది.

అది చూసి శ్రీహాన్ మరింత ఎమోషనలై తనను హగ్ చేసుకున్నాడు.అదే సమయంలో తాము దత్తత తీసుకున్న బాబు కూడా వచ్చి డాడీ అంటూ శ్రీహన్ ను మరింత సర్ ప్రైజ్ చేశాడు.

ప్రస్తుతం ఆ ప్రోమో యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది.

Gauri Kishan, Aditya : 96 మూవీ బాలనటులు గౌరీ కిషన్, ఆదిత్య పెళ్లి చేసుకున్నారా.. ఆ ఫోటోల్లో నిజమెంత?