ఎన్టీఆర్ భవన్ కి తరలివెళ్లిన సిరిసిల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు.
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కిట్ల పంపిణీ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ వర్గం నుండి నియోజకవర్గ బాద్యులు ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో అన్ని మండలాల అధ్యక్ష ప్రధానకార్యదర్శులు తరలి వెళ్లడం జరిగింది.
ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తీగల శేఖర్ గౌడ్, మాలోత్ సూర్యనాయక్, నారాయణ గౌడ్,చెపూరి ప్రభాకర్,కడారి రాంరెడ్డి,పర్మాల మల్లేశం, ఎం డి ఆయూబ్ ఖాన్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి, శ్యాగ ప్రశాంత్, ఎండి సల్మాన్, శనిగరం బాలరాజు, మాలోత్ హరిసింగ్ నాయక్ తదితరులు ఉన్నారు.
వీడియో: ఏం కొట్టావ్ అమ్మా.. కామాంధుడి చెంపలు వాచిపోయే ఉంటాయి..!!