కేటీఆర్‌కు ఊహించని షాక్‌ ఇచ్చిన సిరిసిల్ల ఇండిపెండెంట్స్‌

తెలంగాణ వ్యాప్తంగా వెలువడుతున్న మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయి.దాదాపు అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ జెండా పాతడం ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉంది.

అద్బుతమైన మెజార్టీలు పలు చోట్ల నమోదు అవుతున్నాయి.అయితే కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తూ బాధ్యుడిగా ఉన్న సిరిసిల్ల మున్సిపాలిటీలో మాత్రం టీఆర్‌ఎస్‌ గెలిచినా కూడా పరువు పోగొట్టుకుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన ప్రత్యర్థులుగా స్వతంత్రులు నిలిచారు.సిరిసిల్ల మున్సిపల్‌ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ రంగంలోకి దిగి మరీ ప్రచారం చేశారు.

అనేక పర్యాయాలు సిరిసిల్ల పర్యటించి వార్డు మెంబర్ల తరపున ప్రచారం చేయడం జరిగింది.

అక్కడ టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయం అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు భావించారు.

కాని మొత్తం 39 వార్డులకు గాను 24 వార్డులను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది.అక్కడ స్వతంత్రులు ఏకంగా 10 మంది గెలవడం జరిగింది.

ఇక కాంగ్రెస్‌ 2 మరియు బీజేపీ 3 సీట్లను గెలుచుకోవడం కూడా టీఆర్‌ఎస్‌కు దెబ్బగా చెప్పుకోవాలి.

సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డా కూడా ఓడిపోయిన స్థానాలు కేటీఆర్‌ పరువుకు తీశాయంటూ రాజకీయంగా చర్చ జరుగుతోంది.

బీజేపీతో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామా ? తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ?