మరోమారు మానవత్వం చాటుకున్న కలెక్టర్..

రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన చెవిటి, మూగ బాలిక దోమకొండ లహరి విద్యాభ్యాసానికి జిల్లా కలెక్టర్ సందీప్ ఝా అండగా నిలిచారు.

వివరాలోకి వెళ్తే.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గర్జనపల్లి గ్రామ పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ దృష్టికి లహరి సమస్యను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాకేష్ గౌడ్ వివరించారు.

పదవ తరగతి వరకు చదివిన లహరి విద్యాభ్యాసానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలిపారు.

నిరుపేద కుటుంబానికి లహరి కుటుంబం దినస్థితిలో ఉందని కలెక్టర్ దృష్టికి విన్నవించారు.విద్యాభ్యాసానికి చొరవ చూపాలని రాకేష్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

సానుకూలంగా స్పందించిన కలెక్టర్ లహరితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.లహరి చదువుకు కావలసిన అన్ని ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని తహసిల్దార్ మారుతి రెడ్డిని ఆదేశించారు.

మరోమారు మానవతా దృక్పథంతో లహరి చదువుకు కొండంతా భరోసానిచ్చిన జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకుడు రాకేష్ గౌడ్ లహరి తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

చనిపోయిన భార్యను బ్రతికించిన ఒడిశా వ్యక్తి.. ఎలాగంటే?