నీట మునిగిన పంట పొలాలను కాపాడండి సారూ

నీట మునిగిన పంట పొలాలను కాపాడండి సారూ

సూర్యాపేట జిల్లా:50 ఎకరాల పంట పొలాలను నీటి మునక నుండి కాపాడాలని తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన మునక పొలాల రైతులు జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు.

నీట మునిగిన పంట పొలాలను కాపాడండి సారూ

ఈ సందర్భంగా రైతు ఆకారపు నాగరాజు మాట్లాడుతూ మా గ్రామంలో జరిగే బాధాకరమైన విషయం ఏమిటంటే ఈమధ్య వారం రోజుల నుండి వస్తున్న వర్షాలకు గ్రామానికి చెందిన రైతులవి 50 ఎకరాల పొలాలు మొత్తం నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నీట మునిగిన పంట పొలాలను కాపాడండి సారూ

ఈ పొలాలే జీవనాధారంగా బ్రతుకున్న పేద రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఇదే విషయం గురించి రైతులు ఎంత మందికి మొరపెట్టుకొన్నా పట్టించుకోని నాథుడే లేడని వాపోయాడు.

నేషనల్ హైవే 365 నుండి ఊళ్లకు వచ్చే దారి జాజిరెడ్డిగూడెం నుండి కొత్తగూడెం వెళ్లే దారి మొత్తం నీట మునిగి ఏ టైంలో తెగిపోతుందో తెలియక గ్రామ ప్రజలు అల్లాడుతున్నారని,రోడ్డు తెగడం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని,తక్షణమే చెరువు నీటిని కిందకు వదిలి మునకపొలాల రైతులకు న్యాయం చేయాలని కోరారు.

శిగ రవి మాట్లాడుతూ చెరువులో మునకలో 50 ఎకరాలు మునగడంతో పంటలు పండే అవకాశం లేక,పై ఉన్న రైతుల భూముల వద్దకు వెళ్ళే వాహనాలకు ఆటంకం ఏర్పడిందని,పశువులు,మేకలు,గొర్రెలు అన్నింటికీ రాకపోకలకు ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.

ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి నీటిలో నుండి పాములు,తేళ్లు,దోమలు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

అసలే వర్షాకాలం దోమకాటుతో డెంగ్యూ,మలేరియా, బోదకాలు,విషజ్వరాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.అందుకే వీలైనంత తొందరగా చెరువు నీటిని యధావిధిగా బయటకి పంపి గ్రామాన్ని కాపాడాలని కోరారు.

చెరువులో నీళ్లు నిల్వ ఉండడానికి కారణం గతంలో రింగు అంజయ్య పొలం మీదగా వరద పోయేదని,ఇప్పుడు పోకుండా రాళ్లతో గోడ కట్టి మొరం అడ్డంగా పోశారని ఆరోపించారు.

వాళ్ళ కుటుంబ సభ్యులను గతంలో ఇక్కడ నుండి నీళ్లు పోయేవి కదా ఇప్పుడు ఎందుకు పోనీయట్లేదని గ్రామ ప్రజలు,స్థానిక ఎంపీటీసీ అడిగితే గతంలో మా పొలం మీదుగా పోయిన మాట వాస్తవమే కానీ,వర్షాలు వచ్చినప్పుడు వర్షపు నీరు పొలాల వరద మాత్రమే పోయేదని,ఇప్పుడు మాత్రం 24 గంటలు ఊళ్లో మురికి కాల్వల నీరు పోతుందని,దానితోమా పొలంపండే పరిస్థితి లేదని,తడి ఆరే పరిస్థితి లేదని, కనుక మేము అడ్డుకట్ట వేశామని అంటున్నారని అన్నారు.

ఈ మురికి కాలువల నీళ్లు పొలానికి పోవడానికి బాధ్యులు స్థానిక సర్పంచ్ అని ఆరోపించారు.

గతంలో యధావిధిగా పొయే నీళ్లను ఆ విధంగా పోనిస్తే ఏ సమస్య ఉండేది కాదని,పాత ఎస్సీ కాలనీ మురికి కాలువ నీళ్లు కూడా తీసుకొచ్చి ఇటు వదిలి పెట్టడంతో ఊరు మొత్తం మురికికాల్వల నీళ్లు అంజయ్య పొలం మీదుగా పోతుందని,దానికే ఆయన అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

వార్టన్ స్కూల్‌లో భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌కు కీలకపదవి!

వార్టన్ స్కూల్‌లో భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌కు కీలకపదవి!