తెలుగులో అప్పుడే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చిన ‘సార్’!

టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సార్'.

ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాతో తమిళ్ హీరో ధనుష్ తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమా ప్రీమియర్స్ నుండే అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

ఇక ధనుష్ కెరీర్ లోనే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ వసూళ్లు నమోదు అవుతున్నాయి.

ఈ సినిమా మూడు రోజుల్లోనే మంచి గ్రాస్ ని అందుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

అంతేకాదు మొదటి రోజు కన్నా రెండవ రోజు, మూడవ రోజు ఈ సినిమా మరింతగా వసూళ్లను రాబట్టిందట.

మూడవ రోజు ఆదివారం కావడంతో మంచి వసూళ్లు వచ్చాయి.మొత్తానికి మేకర్స్ పెట్టుకున్న అంచనాలను అయితే సార్ రీచ్ అయ్యింది అనే చెప్పాలి.

"""/"/ ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే లాభాలను అందుకున్నట్టు టాక్.

ఈ సినిమా మూడు రోజుల్లోనే 16.5 కోట్ల రూపాయల వసూళ్ళను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి ప్రాఫిట్ జోన్ లోకి కూడా ప్రవేశించిందట.

అయితే సోమవారం టెస్ట్ కూడా పాస్ అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే.

"""/"/ ఇక తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ అయినా ఈ సినిమాలో సంయుక్త మీనన్ ధనుష్ సరసన హీరోయిన్ గా నటించగా.

జివి ప్రకాష్ సంగీతం అందించాడు.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం అయితే ఉంది.

మొత్తానికి వెంకీ అట్లూరి తెలుగు హీరోలకు సూపర్ హిట్ ఇవ్వకపోయినా తమిళ్ హీరోకు అయితే మంచి హిట్ ఇచ్చాడు.

మహేష్ బాబు, రవితేజలతో సినిమాలు.. శ్రీనువైట్ల రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!