ఆమె ఇద్దరు పిల్లలను వేరువేరుగా దత్తత తీసుకుంది.. ఆ తర్వాత వారి గురించి తెలిసి అవాక్కయ్యింది
TeluguStop.com
కొన్ని సంఘటనలను చూసినప్పుడు, విన్నప్పుడు నిజంగానే ఇది జరిగిందా అని ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది.
తాజాగా ఇలాంటిదే అమెరికాలో జరిగింది.30 ఏళ్ల కాటీ పేజ్ కొన్నాళ్ల క్రితం భర్త నుండి విడిపోయింది.
ఆమె తోడు కోసం పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంది.అందుకోసం ఒక స్వచ్చంద సంస్థ ను ఆశ్రయించింది.
మొదట ఒక రోజుల బాబును కాటీ పేజ్ దత్తత తీసుకుంది.ఆ బాబుకు 11 నెలలు వచ్చిన తర్వాత మరో పాపను కూడా దత్తత తీసుకుంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
దత్తత తీసుకున్న కొన్ని రోజుల తర్వాత అధికారికంగా దత్తత ను రిజిస్టర్ చేయించేందుకు ఆమె సిద్ధం అయ్యింది.
ఆ సమయంలో ఆమె అవాకయ్యే విషయం తెలుసుకుంది.ఆమెకు తెలియకుండానే ఒక్క తల్లికి చెందిన పిల్లలను దత్తతకు తీసుకుంది.
ఇదో వింత సంఘటనగా అమెరికాలో నిలిచింది.హాస్పిటల్ లో ఇచ్చిన సమాచారం ద్వారా వారిద్దరూ కూడా ఒకే తల్లి పిల్లలు అని తెలుసుకుని అవాక్కయింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
తన ఇద్దరు పిల్లలకు కూడా తల్లి ఒక్కరే అనే విషయాన్ని తెలుసుకున్న కాటీ పేజ్ వెంటనే ఆమెను కలుసుకునేందుకు ప్రయత్నించింది.
తన పిల్లల కన్న తల్లిని కలుసుకున్న కాటిపేజ్ తనకోసం మరొకరిని కానీ ఇవ్వాల్సిందిగా కోరింది.
అందుకు ఆమె కూడా సరే అన్నది.మరి కొన్ని నెలల్లోనే కాటిపేజ్ కు మరో పాపాయి చేతిలోకి రాబోతుంది.
ఆ ముగ్గురిని కూడా తన కడుపున పుట్టిన పిల్లల మాదిరిగా చూసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది.
ముసలోడే కానీ మహానుభావుడు.. టిక్‌టాక్ లవర్ కోసం భార్యను వదిలేశాడు.. చివరకు?