ప్రభాస్ సాహో మ్యూజిక్ డైరెక్టర్ పై కెనడా లో దాడి,కారణం!

యంగ్ రెబెల్ స్టార్ గా పిలవబడే ప్రభాస్ బాహుబలి తరువాత చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సాహో.

ఈ చిత్రం ఎప్పుడు ధియేటర్స్ కు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఆగస్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కు సిద్దమౌతున్న ఈ సమయంలో ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ గురు రంధవా పై కొందరు దాడి చేసినట్లు తెలుస్తుంది.

ఈ యువ కంపోజర్ కెనడా లో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం కోసం అని వెళ్లగా అక్కడ కొంతమంది దాడి చేశారు.

కారణం లైవ్ కాన్సెర్ట్ లో పాల్గొని స్టేజ్ పై లైవ్ ఇచ్చేందుకు వెళుతున్న సమయంలో గార్డులు ఆయనను ఆపేశారు.

ఈ సమయంలో ఆయనపై దాడి చోటుచేసుకోవడం తో ఆయన స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తుంది.

అయితే ఒక్క కంటిపై మాత్రం బలమైన గాయం కావడంలో కుట్లు కూడా వేసినట్లు తెలుస్తుంది.

అయితే ఈ ఘటన జరగడం తో అక్కడే ప్రాధమిక చికిత్స తీసుకున్న అనంతరం గురు తిరిగి ఇండియాకు కూడా వచ్చేశారట.

అయినా అయిపోయిన విషయం ఎప్పుడు తెలిసినా నెటిజన్లు ఊరుకుంటారా మరి.ఇక ఈ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.