Chakri: చక్రిది ఖచ్చితంగా సహజ మరణం కాదు : ప్రముఖ సింగర్

సంగీత దర్శకుడు చక్రి( Chakri ) తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో మధురమైన పాటలకు ప్రాణం పోసి అతి చిన్న వయసులో కన్నుమూశారు.

ఆయన మరణానికి కారణం నేటి వరకు మిస్టరీగానే ఉంది.చక్రికి భార్య శ్రావణి( Shravani ) తో పాటు ఒక తమ్ముడు, ముగ్గురు అక్కలు మరియు వృద్ద తల్లి కూడా ఉన్నారు.

ఒకరిపై ఒకరు గొడవలు పడుతూ ఆస్తుల కోసం చక్రి కన్ను ముటగానే కేసులు వేసుకొని బాహటంగానే కొట్లాడుకున్నారు.

కానీ చక్రి మరణం పట్ల మాత్రం ఆయన అభిమానులకు ఇప్పటికీ ఎన్నో సందేహాలు ఉన్నాయి.

ఆయన చనిపోవడానికి ముందు కొన్ని రోజుల పాటు ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యారంటూ ఆయన సన్నిహితులు చాలా మంది చెబుతున్నారు.

"""/" / మరి కుటుంబ కలహాలతో పాటు చక్రికి ఆయన భార్యతో కల గొడవలే అందుకు కారణమంటూ కొంత మంది చెబుతున్నప్పటికీ నిజమైన కారణాలు ఏంటో మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు.

చక్రితో చాలా దగ్గర బంధం కలిగి ఆయనతో పాటే చివరి రోజు వరకు ఉన్నవారు కూడా చక్రీది సహజ మరణం అంటే ఒప్పుకోవడం లేదు.

ఈ విషయాన్ని మరోసారి దృవీకరిస్తున్నారు ప్రముఖ సింగర్ వేణు శ్రీరంగం( Singer Venu Srirangam ).

వేణు చక్రి సినిమాలలో ఎక్కువగా పాటలు పాడాడు చక్రితో పాటే ఆయన దాదాపు నాలుగేళ్ల పాటు ఎక్కువగా కలిసి ఉన్నారు వారంలో ఐదు రోజులు చక్రి తోనే ఉన్న వేణు చక్రి సంగీతం అందించిన ఆ సినిమాలకు కొన్ని పాటలు కూడా పాడారు.

"""/" / చక్రీకి కొన్ని చెడు ఆహార అలవాట్లు మరియు మద్యం తాగే వంటి అలవాట్లు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగానే ఉండేవారు.

కానీ ఆయన మాత్రం సహజంగా కన్ను మూయలేదు.ఎందుకంటే చక్రి చనిపోవడానికి ముందు రోజు వరకు నేను అతనితోనే ఉన్నాను.

ఎక్కువ లేట్ నైట్ రికార్డింగ్ చేస్తారు అలాగే ఎక్కువగా స్నేహితులతో కూర్చొని మందు కొడుతూనే ఉండేవారు.

కానీ చక్రికి మాత్రం ఒక రకమైన మానసిక సంఘర్షణ ఉండేది.తన భార్య మరియు తల్లి మధ్య కొన్ని వివాదాలు ఉండడంతో పాటు కొన్ని చూడకూడనివి చక్రి కంట పడ్డాయని ఆయన తన స్నేహితుల దగ్గర చెప్పుకొని వాపోయారట.

ఆ విషయం బయట ప్రపంచానికి చెప్పడానికి అప్పట్లో ఎవరు ఒప్పుకోలేదు.ఇప్పుడు బయట పెట్టిన దానివల్ల వచ్చే ఉపయోగం లేదు.

ఏది ఏమైనా ఆయన మరణించడం మాత్రం టాలీవుడ్ తో పాటు చాలా మందికి తీరని లోటు అని చెప్పాలి అంటూ ఎమోషనల్ అయ్యారు వేణు శ్రీరంగం.

కవిత బెయిల్ పై బీఆర్ఎస్ ఆశలు..  నేడు సుప్రీం లో విచారణ