సింగర్ సునీత ప్లాన్ మామూలుగా లేదుగా.. రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన వారసుడు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గత ఏడాది మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా రెండవ వివాహం ద్వారా సునీత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.అయినా వాటి గురించి పట్టించుకోకుండా తన జీవితంలో ముందుకు వెళ్తున్నారు.

సునీత రెండో వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తన భర్తతో కలిసి తన వ్యాపారాలను కూడా చూసుకుంటూ బిజీగా గడుపుతున్న సునీత సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తన కుమారుడు ఆకాష్ ను త్వరలోనే తెలుగు తెరకు హీరోగా పరిచయం చేయాలని సునీత ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

"""/"/ ఇక ఆకాష్ హీరోగా నటించిన సినిమాకు తన భర్త రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాకు సంబంధించిన వివరాలు సాంకేతిక నిపుణులు నటీనటుల గురించి సునీత త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నట్లు టాలీవుడ్ సమాచారం.

ఇక గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆకాష్ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముద్రగడ ‘ పై కుమార్తె ఫైర్.. పవన్ కు మద్దతు