నన్ను ఇష్టపడేది పాట కోసమా? నా అందం కోసమా.. సింగర్ సునీత సూటి ప్రశ్న?

తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ సునీత గురించి వ్యతిరేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో మంచి మంచి పాటలను పాడి గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది సింగర్ సునీత.

ఈమె సింగర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ లతో సమానంగా క్రేజ్ ని సంపాదించుకుంది.

నాలుగు పదుల వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అందం విషయంలో కూడా బాగానే అభిమానులను సంపాదించుకుంది.

మరి ముఖ్యంగా సింగర్ సునీత స్వీట్ వాయిస్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది సునీత.

ఇటీవల సునీత ఒక మీడియా ఛానల్ తో ముచ్చటించగా.అప్పుడు సదరు యాంకర్ టాప్ హీరోయిన్లకు సమానమైన ఫ్యాన్స్ బేస్ మీకు ఉందని, మీరు ట్రెండ్ సెట్టరా అని ప్రశ్నించారు.

ఆ విషయం పై స్పందించిన సునీత.తనకు అదే అర్థం కాదని, అసలు వారంత తనలో ఏం చూసి అభిమానిస్తున్నారో అర్థం కాక కన్‌ఫ్యూజ్‌ అవుతాను అని తెలిపింది సునీత.

దీంతో వెంటనే సదరు యాంకర్.అంటే మీకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ ఉంది అనేది మీరు ఒప్పుకోవడం లేదా అని అడగగా.

ఇలాంటి కొన్ని అంశాలు తనని చాలా ఇబ్బంది పెడతాయని ఆమె తెలిపింది.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.

నేను ఎప్పుడు ఆలోచించే విషయం ఇదే.వారందరూ నా పాట అంటే ఇష్టపడతారా? లేక నా చీరను ఇష్టపడతారా? నేను అందంగా ఉంటానని ఇష్టపడతారా? అదే నాకు అర్థం కాదు.

"""/"/ ఎక్కడికి వెళ్లిన మేడం మీ పాట అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలకరిస్తారు అంటూ ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది.

సింగర్ సునీత ఒక ఈవెంట్ కి వెళ్లినప్పుడు అక్కడ ఒక అతను సునీతని చూసి పరిగెత్తుకుంటూ వస్తుండగా చుట్టూ ఉన్న బౌసర్లు అతన్ని అడ్డుకోవడంతో ఆమె అతని వదిలేయమని చెప్పిందట.

దీంతో సదరి వ్యక్తి సునీత దగ్గరికి వచ్చి ఫోన్లో ఆమె ఫోటో చూపించి మేడం ఈ చీర ఎక్కడ కొన్నారు చాలా బాగుంది ఇలాంటిది మా ఆవిడకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాడట.

ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది సింగర్ సునీత.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024