Singer Sunitha: నా లైఫ్ లో మార్పు తెచ్చిన క్షణమిదే.. వివాహ వార్షికోత్సవం సందర్భంగా సునీత ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు సింగర్ సునీత( Singer Sunitha ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈమె కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో ఎన్నో పాటలు పాడి సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
కాగా 19 ఏళ్ల వయసులోనే సినీ కెరియర్ ను ప్రారంభించిన సునీతకు ఊహించని విధంగా 19 ఏళ్లకే పెళ్లి అయింది.
అలా చిన్న వయసులోనే సంపాదిస్తూ కుటుంబానికి తానే పెద్ద దిక్కుగా నిలిచింది. """/" /
ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో మనస్పర్ధలు రావడంతో మనస్పర్థలు రావడంతో విడాకులు( Divorce ) తీసుకుని విడిపోయింది సునీత.
అయినప్పటికీ ఆమె సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో కొనసాగుతూ తన కెరీర్ ని కొనసాగిస్తూ వచ్చింది.
అలా తన మధురమైన పాటలతో దాదాపు పాతికేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.
టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి( Singer ) లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది.
జీవితంలో అన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్న సింగర్ సునీత మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
"""/" /
జనవరి 9న, 2021లో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని( Ram Veerapaneni ) రెండవ వివాహం చేసుకుంది సునీత.
ఆమెకు రెండో పెళ్లయ్యాక మూడో వివాహా వార్షికోత్సవం ఇవాళ జరుపుకుంది.తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
నా జీవితం మొత్తంలో అద్భుతమైన క్షణమిదే అంటూ పోస్ట్ చేశారు.అలాగే ఆమె పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇకపోతే సింగర్ సునీత కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
పానీపూరీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. జస్ట్ ఇంత పే చేస్తే లైఫ్‌లాంగ్ పానీపూరీ ఫ్రీ.. ఎక్కడంటే?