ఆ నమ్మకంతోనే నేను బ్రతికేస్తున్నా.. సింగర్ సునీత కామెంట్స్ వైరల్!

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో సునీతకు భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.సునీత వందల సంఖ్యలో పాటలు పాడటంతో పాటు స్టార్ హీరోయిన్ల స్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

మొదటి భర్తతో కొన్ని రీజన్స్ వల్ల విడిపోయిన సునీత రెండో పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన సునీత భర్తతో కలిసి దిగిన ఫోటోలను పంచుకోవడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తాజాగా సునీత ఒక ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకుల హృదయాలను కదిలించారు.

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం తన సినీ కెరీర్ లో 40,000 కంటే ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన సంగతి తెలిసిందే.

పాడిన పాటల ద్వారా ఎస్పీ బాలు ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.

"""/"/ గతేడాది కరోనా బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం 2020 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన చికిత్సకు కోలుకోలేక ఆరోగ్యం విషమించి మృతి చెందారు.

బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడి దాదాపుగా సంవత్సరం అవుతున్న నేపథ్యంలో సునీత ఎమోషనల్ అయ్యారు.

ఎస్పీ బాలును మామయ్యా అని పోస్ట్ లో పిలుస్తూ ఒక్కసారి గతంలోకి నడవాలని ఉందని సునీత అన్నారు.

"""/"/ ఎస్పీ బాలు పాట వినాలని ఉందని నువ్వు పాట పాడితే చప్పట్లు కొట్టాలని ఉందంటూ సునీత చెప్పుకొచ్చారు.

సందిగ్ధం వల్ల తన గొంతు మూగబోతుందని సునీత కామెంట్లు చేశారు.తన గురువు, ధైర్యం, బలం, నమ్మకం ఎప్పటికీ ఎస్పీ బాలు అని సునీత వెల్లడించారు.

తాను ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానని సునీత కామెంట్లు చేశారు.సునీత చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

గర్ల్‌ఫ్రెండ్ లేని వారికి అదిరిపోయే ఐడియా.. ఈ జపనీస్ వ్యక్తి క్రియేటివిటీ అదుర్స్ ..?