కూతురు కోసం పెద్ద సాహసం చేయబోతున్న సింగర్ సునీత?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సింగర్ గా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సునీత తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.
19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత భర్త నుంచి విడిపోయి ఒంటరిగా పిల్లలను పెంచి పెద్ద చేశారు.
ఈ విధంగా తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూసిన సునీత 2020 వసంవత్సరంలో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని పెళ్లి చేసుకోవడంతో ఈమె జీవితం సరికొత్త మలుపు తిరిగిందని చెప్పాలి.
ఈ విధంగా రెండవ వివాహం చేసుకున్న తర్వాత సునీత తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే రెండవ వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సునీత తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడమే కాకుండా ఈ మధ్య రీల్స్ కూడా చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇలా ఒకవైపు తన కెరీర్ కొనసాగిస్తూనే మరోవైపు ఒక తల్లిగా తన పిల్లల బాగోగులను చూసుకొని వారి భవిష్యత్తును చక్కదిద్దే పనిలో ఉన్నారు.
"""/"/ ఇప్పటికే తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్న ఆలోచనలో సునీత ఉండగా తన కూతురు శ్రేయ సైతం ఇదివరకే సింగర్ గా పలు సినిమాలలో పాటలను పాడారు.
అయితే తన కుమార్తె కోరికను తీర్చడం కోసం సునీత పెద్ద సాహసం చేస్తున్నారని చెప్పాలి.
తన కూతురు శ్రేయకు ఎలాగైనా నాసాలో సైంటిస్ట్ గా పని చేయాలనేదే ఆమె సంకల్పమట.
ఇలా తన కూతురిని సైంటిస్ట్ చేయడం కోసం ఈమె ఎంత డబ్బు ఖర్చు చేసి అయినా తన కూతురిని చదివించి తన కూతురి కోరికను తీర్చాలని కంకణం కట్టుకున్నారట.
ఈ విధంగా కూతురు కోసం ఇలాంటి సాహసం చేస్తున్న సునీతకు ఎంతోమంది అభిమానులు నేటిజన్ లు సునీత పై ప్రశంసల కురిపించడమే కాకుండా ఆమెకు తన కూతురికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు.
మధుమేహం ఉన్నవారు నెయ్యి తినవచ్చా..?