నా ఎనర్జీ సీక్రెట్ ఇదే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సునీత!
TeluguStop.com
సినిమా రంగంలో తెగ యాక్టివ్ గా ఉండే సింగర్లలో సునీత ఒకరనే సంగతి తెలిసిందే.
వివాదాలకు దూరంగా ఉండే సింగర్ సునీత గాత్రానికి ఫిదా అయ్యే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.
సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చినా, పాట పాడినా ఫుల్ ఎనర్జీతో పాట పాడటం సునీత ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే సింగర్ సునీత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఎనర్జీ సీక్రెట్ ను వెల్లడించారు.
సింగర్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరును సొంతం చేసుకున్న సునీత గతంలో సినిమాల్లో ఆఫర్లు వచ్చినా సున్నితంగా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశారు.
రెండో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సునీత తన పర్సనల్ విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటున్నారు.
లైఫ్ లో ఎదురైన చేదు జ్ఞాపకాల గురించి సునీత తాజాగా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.
"""/"/
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సోషల్ మీడియాలో లైవ్ చాట్ లోకి వచ్చి సునీత అభిమానులు కోరిన పాటలను పాడారు.
తనను అభిమానించే ఫ్యాన్స్ కు లైవ్ ఛాట్స్ ద్వారా సునీత నిత్యం టచ్ లో ఉంటున్నారు.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సునీత తను ఎనర్జీ యొక్క సీక్రెట్ పాటలు పాడటమేనని చెప్పుకొచ్చారు.
సునీత పాటలు పాడటంతో పాటు పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. """/"/
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి సునీత చెప్పుకొచ్చారు.
లైఫ్ లో తగిలిన దెబ్బల వల్ల మనుషుల్ని నమ్మడం మానేశానని సునీత కామెంట్లు చేశారు.
మొదటి పెళ్లి బ్రేకప్ అయిన 15 సంవత్సరాలు కూడా తాను కష్టాలు పడ్డానని సునీత వెల్లడించారు.
నవంబర్ నెల బాక్సాఫీస్ రివ్యూ.. వామ్మో ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదా?