పోకిరి మూవీలో ఆ సింగర్ పాట బాలేదని కామెంట్ చేసిన సునీత.. చివరకు?

మహేష్ బాబు పూరీ జగన్నాథ్( Puri Jagannath ) కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి మూవీ ( Pokiri Movie )బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలు సైతం అంచనాలను మించి హిట్టయ్యాయి.

అయితే ఈ సినిమా గురించి ప్రముఖ టాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ నిహాల్ ( Music Director Nihal )మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సినిమా కోసం నేను పని చేశానని ఆయన చెప్పారు.

ఆ సినిమా కోసం వర్క్ చేసినా ట్రిప్ కు వెళ్లిన ఫీలింగ్ కలిగిందని నిహాల్ పేర్కొన్నారు.

ఊహల పల్లకిలో సాంగ్ ను మొదట రికార్డ్ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.

ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట అని నిహాల్ పేర్కొన్నారు.ఉదయ్, రీమాసేన్ కూడా ఆ సినిమాకు కొత్తే అని నిహాల్ వెల్లడించారు.

"""/" / హీరో పాత్రకు అంతా నేనే పాడానని ఆయన అన్నారు.సీరియల్ సాంగ్స్ కూడా నేను పాడానని ఆయన అన్నారు.

నాకు ఐసీసీఆర్ నుంచి గోల్డ్ మెడల్ కూడా వచ్చిందని నిహాల్ వెల్లడించారు.నేను నాలుగేళ్లు మారిషస్ లో ఉన్నానని ఆ సమయంలో మనసంతా ఇక్కడే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

నేను ఒక ఆల్బమ్ రికార్డ్ చేశానని ఆశా భోంస్లే( Asha Bhosle ) గారు నా వాయిస్ విని నా వాయిస్ కొత్తగా ఉందని ఆన్నారని నిహాల్ వెల్లడించారు.

"""/" / అదృష్టం అనేది ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు.జై చిరంజీవి సినిమాలో థమ్సప్ థండర్ కైనా, పోకిరిలో గలగల పారుతున్న పాటను పాడానని ఆయన అన్నారు.

నేను మొదట ఓపెన్ వాయిస్ తో పాడగా మణిశర్మ అలా వద్దన్నారని నేను పాడిన తర్వాత సునీతను( Singer Sunitha ) పాట ఎలా ఉందని అడగగా ఏం బాలేదని అన్నారని స్క్రీన్ పై చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయానని ఆయన చెప్పుకొచ్చారు.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ.. వైరల్ వార్త నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే!