తోటలో కొడవలితో నరికిన సింగర్ సునీత.. వీడియో వైరల్!
TeluguStop.com
ఈమధ్య సెలబ్రెటీలందరికీ సోషల్ మీడియా బాగా అలవాటయింది.ప్రతి ఒక్క విషయాన్ని తమ ఖాతాల వేదికగా పంచుకుంటున్నారు.
ఇక హీరోయిన్లు మాత్రం తెగ ఫోటో షూట్ అంటూ సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నారు.
మరికొందరు కొన్ని వ్యక్తిగత విషయాలను, మంచి మంచి విషయాలను పంచుకుంటున్నారు.అందులో సింగర్ సునీత కూడా ఒకరు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ సింగర్ సునీత కు ఉందని చెప్పవచ్చు.
ఎందుకంటే తాను తన స్వరంతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.తన పాటలతో మరో లోకానికి తీసుకెళ్తుంది అనే చెప్పవచ్చు.
ఎన్నో సినిమాలలో తన పాటలను అందించింది.కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా కూడా చేసింది.
ఈ మధ్య సునీత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.అప్పట్లో సోషల్ మీడియాకు బాగా దూరంగా ఉండేది.
కానీ తను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
రామ్ వీరపనేని అనే ఓ బిజినెస్ మాన్ ను రెండో పెళ్లి చేసుకుంది.
ఇదివరకే ఆమెకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు.వాళ్ల సపోర్ట్ తోనే రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
"""/" /
ఎంతో కాలంగా ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత మొత్తానికి రెండో పెళ్లి తర్వాత మంచి జీవితాన్ని గడుపుతుంది.
తన భర్తతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది.రెండో పెళ్లి తర్వాత వ్యక్తిగతంగా చాలా విమర్శలు ఎదుర్కొంది.
అయినా కూడా వాటిని ఎదుర్కొని తానేమిటో తన జీవితం ఏంటో చూసుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను, తన భర్త తో దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటోంది.
అప్పుడప్పుడు తన అభిమానులతో లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది.తన భర్తతో కలిసి పలు బిజినెస్ లు చేస్తోందని గతంలో చాలా వార్తలు వినిపించాయి.
కానీ అవన్నీ పుకార్లే అని తేల్చి చెప్పేసింది సునీత.తన భర్త బిజినెస్ విషయంలో తాను ఏమాత్రం బాధ్యతలు వహించని అప్పట్లో తెలిపింది.
ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసుకుంది.
సునీత చాలాసార్లు తను ప్రకృతి ప్రేమికురాలిని అని తెలిపింది.తాజాగా దానికి సంబంధించిన వీడియోను పంచుకుంది.
"""/" /
ఇటీవలే ఆమె ఓ అరటి తోట కు వెళ్లగా అక్కడ అరటి గెలను స్వయంగా కొడవలితో కోసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
ఆ వీడియోకు జాయ్ ఆఫ్ ఫార్మింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఆ వీడియో చూసిన తన ఫాలోవర్స్, నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.
అంతేకాకుండా అందమైన ప్రకృతి అందులో అందమైన సునీత అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.
ఏపీ ఫలితాలపై జగన్ నమ్మకమిదే.. వాళ్ల ఓట్లతో జగన్ చరిత్ర తిరగరాయనున్నారా?