క్యాండీడ్ ఫోటోలను షేర్ చేసిన సింగర్ సునీత.. వైరల్!

టాలీవుడ్ సింగర్ సునీత గురించి అందరికి తెలిసిందే.తన స్వరంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించింది.

సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సినిమాలలో తన సంగీతాన్ని వినిపించింది.

సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా కూడా చేసింది.ఇక కొన్ని రోజుల కిందట సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎంతో కాలంగా ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత బిజినెస్ మాన్ రామ్ వీరపనేని ను రెండో పెళ్లి చేసుకుంది.

ఇక అప్పటినుండి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది.తన అభిమానులతో తెగ ముచ్చటిస్తుంది.

కోవిడ్ నేపథ్యంలో కొన్ని రోజులు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులకు లైవ్ లో పలు జాగ్రత్తలు తెలిపింది.

అంతేకాకుండా ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.వాళ్ల కోసం పాటలు కూడా పాడింది.

ఇదిలా ఉంటే క్యాండీడ్ ఫోటోను షేర్ చేసింది సునీత. """/"/ ఇక ఈమె ప్రస్తుతం బుల్లితెర లో జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ లో జడ్జ్ గా చేస్తుంది.

ఇక సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటో లను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ క్యాండీడ్ ఫోటో షేర్ చేయగా అందులో తన భర్త రామ్ వీరపనేని తో కలిసి ఉంది.

"""/"/ ఇక రామ్ సునీతకు దేని గురించో వివరిస్తున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.

ఈ ఫోటోను చూసిన అభిమానులు క్యూట్ కపుల్స్ అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సునీత.పాడుతా తీయగా లాంటి తరహాలో సరికొత్త ప్రోగ్రాంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తన సంగీతాన్ని వినిపించడానికి రానుంది.

టిడిపి గెలిస్తే లోకేష్ పరిస్థితి ఏంటి ?