హీరో గా, విలన్ గా శ్రీరామచంద్ర నటించిన సినిమాలు ఏంటో తెలుసా ?
TeluguStop.com
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు సింగర్ శ్రీ రామ చంద్ర.
2007 లో సింగర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 15 ఏళ్లుగా పాటలు పాడుతూ ఉన్నాడు.
ఇక ఎన్ని పాటలు పాడిన రాని గుర్తింపు ఆయనకు బిగ్ బాస్ ద్వారా అందిందని చెప్పాలి.
ఇక 36 ఏళ్ల శ్రీరామ్ చంద్ర ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా తనకు నచ్చిన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అద్దంకిలో పుట్టి పెరిగిన శ్రీరామ్, 17 ఏళ్ల వయసు నుంచి పాటలు పాడడం మొదలుపెట్టాడు.
ఎలాంటి మ్యూజిక్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన ప్యాషన్ తోనే అవకాశాలు సంపాదించుకున్నాడు.
2010 సంవత్సరానికి గాను ఇండియన్ ఐడియల్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా గెలిచాడు అలాగే జో జిత ఓహి సూపర్ స్టార్ 2 ఫైనలిస్ట్ గా 2012 వ సంవత్సరం లో నిలిచాడు.
ఇవే కాకుండా అనే టీవీ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడి ఎన్నో వేదికల్లో టైటిల్ విజేతగా నిలిచాడు శ్రీరామ చంద్ర.
బిగ్ బాస్ సీజన్ 5 కి కూడా సెకండ్స్ రన్నరప్ అని చెప్పాలి.
ఇక శ్రీరామ చంద్ర కేవలం సింగర్ మాత్రమే కాదు.అతడికి నటన పైన కూడా ఇంట్రెస్ట్ ఉంది.
అందుకే సినిమాల్లో ఏ అవకాశం వచ్చిన కూడా వదులుకోవడం లేదు.ఆ ఇంట్రెస్ట్ తోనే కొన్ని సినిమాల్లో చేశాడు అవేంటో చూద్దాం.
"""/"/
మొదటగా 2013 లో తొలిసారి మొఖానికి మేకప్ వేసుకున్నాడు.జగద్గురు ఆదిశంకరాచార్యులు సినిమాలో రాజా అమర్కరా పాత్రలో నటించాడు.
ఆ తర్వాత 2014 లో ప్రేమ గీమ జాంత నై అనే సినిమాలో హీరో గా లీడ్ రోల్ లో చేశాడు.
ఆ తర్వాత MMOF సినిమాలో నెగటివ్ రోల్ లో కూడా నటించాడు.ప్రస్తుతం ఏదైనా మంచి పాత్ర వస్తె చేయడానికి సిద్దంగా ఉన్నాడు.
ఇలా సింగర్ శ్రీ రామ చంద్ర కేవలం పాటలకే పరిమితం అవ్వకుండా నటుడిగా కూడా తానేంటో చూపించాలని అనుకుంటున్నాడు.
పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్‌పై కంప్లైంట్.. ఎందుకంటే?