స్టార్ సింగర్‌ సోను నిగమ్‌కు యూకేలో అరుదైన గౌరవం ..!!

స్టార్ సింగర్‌ సోను నిగమ్‌కు యూకేలో అరుదైన గౌరవం !!

బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్‌కు( Singer Sonu Nigam ) యూకేలో అరుదైన గౌవరం దక్కింది.

స్టార్ సింగర్‌ సోను నిగమ్‌కు యూకేలో అరుదైన గౌరవం !!

సంగీత రంగంలో ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని చూపినందుకు గాను గౌరవ ఫెలోషిప్‌ను ఆయన అందుకున్నారు.

స్టార్ సింగర్‌ సోను నిగమ్‌కు యూకేలో అరుదైన గౌరవం !!

నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ (ఎన్ఐఎస్ఏయూ) యూకే గత వారాంతంలో లండన్‌లోని వెంబ్లీ ఎరీనాలో నిగమ్‌ని సత్కరించారు.

బ్రిటీష్ ఇండియన్ లేబర్ ఎంపీ వీరేంద్ర శర్మ ( MP Virendra Sharma ), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (ఎస్‌వోఏఎస్)లో ఇండియన్ కల్చర్ ఎమెరిటస్ అయిన ప్రొఫెసర్ రాచెల్ డ్వైర్‌ల చేతుల మీదుగా సోను నిగమ్ ఈ బహుమతిని అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్ఐఎస్‌ఏయూ యూకే చైర్ సనమ్ అరోరా మాట్లాడుతూ.సంగీతం ద్వారా హృదయాలను , మనస్సులను , దేశాలను ఏకం చేసే వంతెనగా మారారని సోను నిగమ్‌ను అభినందించారు.

ప్రపంచంలోని మొట్టమొదటి లింగమార్పిడి బ్యాండ్‌ను ప్రారంభించడం ద్వారా లింగ సమానత్వం కోసం పోరాడారని అరోరా కొనియాడారు.

"""/" / గతంలో నటి షబానా అజ్మీ( Actress Shabana Azmi ), రచయిత జావేద్ అక్తర్ , ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌లకు ప్రదానం చేసిన గౌరవ ఫెలోషిప్ ద్వారా ప్రపంచవేదికపై భారతీయ సాంస్కృతిక మార్పిడి, విద్య, సామాజిక అభివృద్ధిని గణనీయంగా ప్రభావితం చేసే వ్యక్తులను గౌరవించుకుంటారు.

ఎన్ఐఎస్ఏయూకు ధన్యవాదాలు తెలుపుతూ.ఇదొక అమూల్యమైన బహుమతిగా భావిస్తున్నానని సన్మానం అనంతరం సోనూ నిగమ్ వ్యాఖ్యానించారు.

50 ఏళ్ల సోనూ నిగమ్‌ తన 30 ఏళ్ల కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ కచేరీ సిరీస్‌లను నిర్వహిస్తున్నారు.

లండన్, లీడ్స్, గ్లాస్గో, బర్మింగ్‌హామ్‌లలో పర్యటనను ముగించారు. """/" / 1973 జూలై 30న హర్యానాలోని ఫరీదాబాద్‌లో ( Faridabad, Haryana )జన్మించిన సోను నిగమ్ పూర్తి పేరు.

సోను కుమార్ నిగమ్.నాలుగేళ్ల వయసు నుంచే ఆయన పాటలు పాడటం మొదలుపెట్టారు.

తన తండ్రి అగం కుమార్ నిగమ్‌తో కలిసి వేదికలపై సందడి చేసేవారు.అనంతరం ముంబైకి తన మకాం మార్చిన సోను నిగమ్ .

సూపర్‌హిట్ పాటలు పాడి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.సంగీత రంగానికి సోను నిగమ్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2022లో దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది.

ఆయనకు భార్య మధురిమ మిశ్రా, కుమారుడు ఉన్నారు.

రోడ్డు రోలర్‌ను కూడా వదలలే.. స్క్రాప్‌కు అమ్మేశారు.. తెలంగాణలో షాకింగ్ చోరీ!

రోడ్డు రోలర్‌ను కూడా వదలలే.. స్క్రాప్‌కు అమ్మేశారు.. తెలంగాణలో షాకింగ్ చోరీ!